బిజినెస్

ఆగితే.. కలిసొస్తుందేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియలో ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ మరింత ధర లభిస్తుందేమోననే ఆశతో కొందరు రైతులు అమ్మేందుకు తటపటాయిస్తున్నారు. నిరుడు కేజీ పొగాకు సరాసరి ధర 99 రూపాయలుగా ఉంటే, ప్రస్తుతం గత నాలుగు రోజులుగా జరుగుతోన్న వేలం ప్రక్రియలో సరాసరి 153.61 రూపాయల ధర పలికింది.
రాజమహేంద్రవరం సమీపంలో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో తొర్రేడు కేంద్రంలో వేలం ప్రక్రియ సోమవారం నాలుగో రోజుకు చేరింది. 6వ తేదీ నుంచి వేలం ప్రక్రియ మొదలైంది. వేలం ప్రారంభమైన తొలి రోజు 18 బేళ్లు వేలానికి పెడితే గరిష్ఠ ధర 161 రూపాయలు, కనిష్ట ధర 143 రూపాయలు, సరాసరి ధర 154.49 రూపాయలు లభించిందని వేలం కేంద్రం సూపర్‌వైజర్ వై సుబ్రహ్మణ్యం తెలిపారు. 7వ తేదీన 37 బేళ్లను వేలానికి పెడితే గరిష్ఠంగా 160 రూపాయలు, కనిష్ట ధర 136 రూపాయలు, సరాసరి ధర 153.52 రూపాయలు లభించిందన్నారు. అలాగే 8వ తేదీన 70 బేళ్లు వేలానికి పెడితే గరిష్ఠ ధర 161 రూపాయలు, కనిష్ట ధర 130 రూపాయలు, సరాసరి ధర 154.24 రూపాయలు లభించిందన్నారు. సోమవారం మొత్తం 149 బేళ్లు వేలానికి రాగా, గరిష్ఠ ధర 162 రూపాయలు, కనిష్ట ధర 92 రూపాయలు, సరాసరి ధర 163.24 రూపాయలు లభించిందని వివరించారు. అయితే ధర బాగా లేదని 12 బేళ్లను రైతులు వెనక్కిపట్టుకుపోయారు. కాగా, 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 274 బేళ్లు వేలానికి రాగా, అందులో 254 బేళ్ల అమ్మకం జరిగింది. 20 బేళ్లను రైతులు వెనక్కితీసుకెళ్లారు. ఇప్పటివరకు నాలుగు రోజుల పాటు జరిగిన వేలంలో ధరలను పరిశీలిస్తే గరిష్ఠ ధర 162 రూపాయలు, కనిష్ఠ ధర 92 రూపాయలు, సరాసరి ధర 154.61 రూపాయలు లభించింది. ఇప్పటి వరకు తొర్రేడు కేంద్రంలో 34,988 కిలోల పొగాకు అమ్మకం జరిగింది. ఎక్కువగా హీటెక్, సాఫ్ట్, కేరమ్, కొద్దిగా లైజ్డు బేళ్లు వస్తున్నాయని, దీనివల్ల రేట్లు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు.
కాబట్టి బోర్డు నియమ నిబంధనల ప్రకారం రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సుబ్రహ్మణ్యం కోరారు. మరో వారం రోజుల వరకు ఓపెన్ క్లస్టర్ విధానంలోనే వేలం జరగనుంది. బేరన్‌కు 10 బేళ్ల చొప్పున అనుమతిస్తున్నారు. 2015-16 జూలై 20వ తేదీతో ముగిసిన వేలంలో మొత్తం 21,710 బేళ్లు అమ్మకం జరిగింది. 27 లక్షల 4,784 కేజీల పొగాకు అమ్మగా, సరాసరి ధర 99.28 రూపాయలు లభించింది. 14 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనిమిది కంపెనీలు కొనుగోళ్లు చేపట్టాయి. ఇప్పటికే సరాసరి ధర 153 రూపాయలు లభించడం ఆశాజనకంగానే ఉంది.