బిజినెస్

విదేశీ ఆస్తుల కొనుగోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నప్పటికీ గత నెలలో విదేశీ ఆస్తులను కొనుగోలు చేశారు. టెలివిజన్ కథనాల ప్రకారం అమెరికాలోగల న్యూయా ర్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఉన్న సుప్రసిద్ధ ట్రంప్ ప్లాజాలో ఓ అపార్టుమెంట్‌ను మాల్యా 10 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకున్నారు. 2010లో ప్లాజాలోని పెంట్ హౌస్‌ను కొనుగోలు చేసిన మాల్యా.. దీనికి సంబంధించి 4.6 మిలియన్ డాలర్లను అప్పుడే చెల్లించారు (నాడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకా రం ఇది 21 కోట్ల రూపాయలకు సమానం). ఈ మేరకు న్యూయార్క్ ఆర్థిక శాఖ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఇక దీన్ని మాల్యా తన కూతురు తన్య పేరిట కొనుగోలు చేయగా, ఈ కొనుగోలుకు సంబంధించి రావాల్సిన మిగతా సొమ్ము కోసం గత సంవత్సరం ట్రంప్ ప్లాజా నుంచి మాల్యాకు ఓ లేఖ వచ్చింది. ఈ క్రమంలో గత నెల మార్చిలో ఆ మొత్తం సొమ్మును మాల్యా చెల్లించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థిగా దూసుకెళ్తున్న వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్‌దే ఈ భవనం. కాగా, 900 కోట్ల రూపాయలకుపైగా ఐడిబిఐ రుణం ఎగవేత కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాల్యాపై మనీలాండరింగ్ విచారణను తీవ్రతరం చేసింది కూడా ఇదే నెలలో కావడం గమనార్హం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో ఐడిబిఐ నుంచి తీసుకున్న రుణంలో 430 కోట్ల రూపాయలతో విదేశాల్లో ఆస్తులను మాల్యా కొనుగోలు చేశారని ఇడి వాదిస్తున్నది తెలిసిందే. అయితే మొత్తం 17 బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగానే ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాల్యా.. దేశం విడిచి లండన్ పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు ఎప్పుడొస్తారన్న సమాచారం మాల్యా నుంచి ఇప్పటికీ స్పష్టంగా రావడం లేదు. ఈ తరుణంలో మాల్యాను రప్పించడానికి ఇడి తీవ్రంగా కృషి చేస్తుండగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు నుంచి మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కూడా పొందింది. అంతేగాక విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎమ్‌ఇఎ)తోనూ సంప్రదింపులు జరుపుతోంది. దీంతో సదరు మంత్రిత్వ శాఖ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోందిప్పుడు. ఎమ్‌ఇఎ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ విచారణలకు అందుబాటులో ఉండేలా మాల్యాను భారత్‌కు తీసుకురావాలని ఇడి కోరిందని, అందుకు చర్యలను చేపట్టాలని సూచించిందన్నారు. భారత్‌కు తిరిగొచ్చాక మాల్యా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని ఇడి కోరిందన్నారు. ఈ క్రమం లో ఇందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు స్వరూప్ చెప్పారు. ఇప్పటికే మాల్యా పాస్‌పోర్టును ఎమ్‌ఇఎ నిలిపివేసినది తెలిసిందే. మరోవైపు బ్యాంకులకివ్వాల్సిన 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిల్లో ముందుగా చెల్లిస్తానన్న 4,400 కోట్ల రూపాయలకుతోడు అదనంగా మరో 2,468 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసేందుకు సిద్ధం గా ఉన్నానని ఇటీవల సుప్రీం కోర్టుకు తన న్యాయవాదుల ద్వారా మాల్యా తెలియజేశారు. అయితే తన విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించబోనని, ఈ వివరాలను అడిగే హక్కు బ్యాంకులకు లేదని మాల్యా కోర్టు లో ఓ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ప్లాజాలో అపార్టుమెంట్ కొనుగోలు ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేగాక కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను మళ్లీ నడిపేందు కు ఆసక్తితోనే ఉన్నానని, అధిక ఇంధన ధర లు, పన్నులు, విమాన ఇంజిన్లలో లోపాలు తన ఎయిర్‌లైన్స్‌కు ఈ పరిస్థితిని తెచ్చిపెట్టాయన్నారు. తనకు, తన కుటుంబానికి, యు బి గ్రూప్, కింగ్‌ఫిషర్ ఫినె్వస్ట్‌కు 6,107 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఇదిలా వుంటే న్యూయార్క్ ట్రంప్ ప్లాజాలో 2010 సంవత్సరంలో మొత్తం మూడు అపార్టుమెం ట్లను విజయ్ మాల్యా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో తన్య పెంట్‌హౌస్ కూడా ఉంది.