బిజినెస్

తెలంగాణ గ్రామీణ బ్యాంకు విస్తరణేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నప్పటికీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టిజిబి) మాత్రం పాత ఐదు జిల్లాలకే పరిమితమైంది. మిగతా పాత ఐదు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఎపిజివిబి)గానే పనిచేస్తోంది. ఎపిజివిబి తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ (పాత) జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పనిచేస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఎపిజివిబిని కలపాలని గత మూడేళ్ల నుండి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. టిజిబిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) స్పాన్సర్ చేస్తుండగా, ఎపిజివిబిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) స్పాన్సర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్ కలిసిపోయింది. టిజిబి స్పాన్సర్‌షిప్ కూడా ఎస్‌బిఐ పరిధిలోకే వచ్చేసింది. అయినా విస్తరణ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ తదితర జిల్లాల్లో ఎపిజివిబి నేటికీ నడుస్తూనే ఉంది. హైదరాబాద్‌తోసహా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి (పాత) జిల్లాల్లో టిజిబి నడుస్తోంది. ఇంత కాలం టిజిబిలో ఎపిజివిబిని కలిపేందుకు ఎపిజివిబి ఉద్యోగులే వ్యతిరేకిస్తూ వచ్చారు. పరిస్థితులు మారడంతో ఎవరు వ్యతిరేకించినా టిజిబి-ఎపిజివిబి కలిసిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఒకటి ఈ అంశంపై అధ్యయనం చేసి సిఫార్సులు కూడా చేసింది. టిజిబి చైర్మన్ బిఆర్‌జి ఉపాధ్యాయ, ఎపిజివిబి చైర్మన్ వి నాగిరెడ్డి కూడా పలుమార్లు సమావేశమై రెండు బ్యాంకులను కలిపేందుకు ఎదురౌతున్న ఇక్కట్లపై చర్చించారు. ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతోనూ వారు మాట్లాడారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎపిజివిబి ఆస్తులు, అప్పులను విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపైనా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆస్తులు, అప్పులను ఏ విధంగా విభజించాలన్న అంశంపై ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. అయతే ఈ బ్యాంకు ఆస్తులు అప్పులను ఇటు తెలంగాణలోని పాత ఐదు జిల్లాలు, ఎపిలోని మూడు జిల్లాలకు అందేలా విభజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ విభజన కార్యక్రమం పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో సంబంధిత ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విభజన ప్రక్రియ పూర్తయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల మరో పర్యాయం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.