బిజినెస్

చేపల పెంపకం బోర్డును మార్చే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ చేపల పెంపకం బోర్డును ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు మార్చే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన మూల ప్రశ్నపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ రాధామోహన్ సింగ్ ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ చేపల పెంపకం డైరెక్టరేట్‌ను విజయవాడకు తరలించాలని ఏపీ ప్రభుత్వం చాలా కాలం నుండి కోరుతోందని ఆయన వెల్లడించారు.‘హైదరాబాద్‌లో ఉన్న ఫిషరీస్ బోర్డును విజయవాడకు మార్చేందుకు అంగీకరిస్తే కేరళలో ఉన్న కొబ్బరి అభివృద్ధి డైరెక్టరేట్‌ను మరో ప్రాంతానికి తరలించాలనే డిమాండ్ రావచ్చు, ఇలా ప్రతి బోర్డు గురించి డిమాండ్లు వస్తే అమలు చేయటం సాధ్యం కాదు.’ అని రాధామోహన్ సింగ్ తేల్చి చెప్పారు. కాబట్టి హైదరాబాద్‌లోని ఫిషరీస్ డైరెక్టరేట్ అక్కడే ఉంటుందన్నారు. అంతకు ముందు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 46 లక్షల మంది చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేప పిల్లల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని ఆయన కోరారు. దీనికి రాధామోహన్ సింగ్ బదులిస్తూ కేంద్రం చేప పిల్లలను సరఫరా చేయదుగానీ దీని కోసం ఆర్థిక సహయం చేస్తుందని చెప్పారు. మరోవైపు బిజెపి సభ్యుడు రాంచరిత్ర నిషాద్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఫిషరీస్ బోర్డును ఢిల్లీకి మార్చాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఇరవై కోట్ల మంది మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్య అవసరమని ఆయన వాదించారు. దీనికి రాధామోహన్ సింగ్ స్పందిస్తూ ‘్ఫషరీస్ బోర్డును విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకసార్లు డిమాండ్ చేసింది. ఏపీ ఎంపీలు పలుమార్లు తనను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఈ డిమాండ్ వస్తోంది. కానీ దీనిని ఆమోదించటం సాధ్యం కాదు.’ అని సింగ్ అన్నారు. ఫిషరీస్ బోర్డుకు రాజకీయ నాయకుడిని అధ్యక్షుడిగా నియమించటం కూడా సాధ్యం కాదని మంత్రి రాధామోహన్ సింగ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

చిత్రం..హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య సంపద అభివృద్ధి బోర్డు నూతన ప్రధాన కార్యాలయం