బిజినెస్

త్వరలో అమెజాన్ వ్యాలెట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు స్నాప్‌డీల్, పేటియమ్ లాంటి ప్రత్యర్థులతో విస్తృత స్థాయిలో పోటీపడుతున్న అంతర్జాతీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. దేశంలో ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పిపిఐ) లేదా మొబైల్ వ్యాలెట్ సేవలను ప్రారంభించేందుకు అమెజాన్ ఇండియా భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నుంచి లైసెన్సును పొందింది. భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌ను సొమ్ము చేసుకోవడంలో అమెజాన్‌కు ఈ లైసెన్సు దోహదపడుంతుంది. రిజర్వు బ్యాంకు నుంచి తమకు పిపిఐ లైసెన్సు లభించిందని వెల్లడించేందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని, ఇక తమ వినియోగదారులకు సౌకర్యవంతంగా, నమ్మకంగా నగదు రహిత చెల్లింపుల సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని అమెజాన్ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్ భారత్‌లో నగదు రహిత చెల్లింపులను సొమ్ము చేసుకునేందుకు గత ఏడాది డిసెంబర్‌లో ‘పే బ్యాలెన్స్’ సర్వీసును ప్రారంభించిన విషయం విదితమే. అయితే ఇతర మొబైల్ వ్యాలెట్ సేవా సంస్థల మాదిరిగా ఈ సేవ కూడా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో జరిగే లావాదేవీలకు మాత్రమే పరిమితమైంది. 2014లో తాము పెట్టుబడులు పెట్టిన గిఫ్ట్‌కార్డు ప్రొవైడర్ ‘క్విక్‌సిల్వర్’ జారీ చేసిన పిపిఐ లైసెన్సుతో పే బ్యాలెన్స్ సర్వీసను ప్రారంభించిన అమెజాన్‌కు ఇప్పడు ఆర్‌బిఐ నుంచి పిపిఐ లైసెన్సు లభించడంతో పేటియం, స్నాప్‌డీల్ (ఫ్రీచార్జ్) లాంటి ప్రత్యర్థులకు దీటుగా ఇతర వ్యాపారులు కూడా అంగీకరించే మొబైల్ వ్యాలెట్ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.