బిజినెస్

రైలు ప్రయాణికులకు ‘డ్వాక్రా’ వంటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 13: ప్రయాణికులు ఇక నుంచి పసందైన వంటకాలు రుచిచూడనున్నారు. ఇందుకు రైల్వే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఇప్పటికే 50 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, భారతీయరైల్వేకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్ పరిధిలో త్వరలో ఇది అమలు కానుంది. ఇందుకోసం రైల్వే కసరత్తు ప్రారంభించింది. జోన్ పరిధిలోకి వచ్చే వాల్తేరు, ఖుర్ధా, సంబల్‌పూర్ డివిజన్ల పరిధిలో స్వయం సహాయక బృందాల వివరాలను సేకరించడం, ఆ తదుపరి ముఖ్యమైన రైల్వేస్టేషన్ల పరిధిలో నడిచే ఈ బృందాలకు పిండి వంటలు, ఆహార పదార్ధాల తయారీలో ప్రత్యేక శిక్షణనివ్వడం, రిజర్వేషన్ టికెట్‌పైన ఇచ్చే టెలిఫోన్ నెంబర్ ద్వారా వంటకాల ఆర్డర్‌ను సేకరించడం, తద్వారా ప్రయాణికులు కోరిన వంటకాలను ఆయా రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచే కార్యక్రమాలపై డివిజన్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. స్వయం సహాయక బృందాల ద్వారా పసందైన వంటకాలు తయారు చేయించి వీటిని ప్రయాణికులకు అందించే పథకం తొలుత వాల్తేరు డివిజన్‌లో ప్రారంభమవుతుంది. ఆ తరువాత దశలవారీగా జోన్ పరిధిలో దీనిని విస్తరించనున్నారు. బేస్ కిచెన్లు లేని రైల్వేస్టేషన్లల్లో తొలుత ఈ పథకం అమల్లోకి రానుంది. అలాగే ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ సర్వీస్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో అందివ్వలేని వంటకాలను ఈ స్వయం సహాయక బృందాలతో తయారు చేయించి అందిస్తారు. ఐఆర్‌సిటిసితో స్వయం సహాయక బృందాలు సమన్వయమై ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. రైల్వే రిజర్వేషన్ టికెట్‌పైన పేర్కొన మొబైల్ నెంబర్ ఉపయోగించే ప్రయాణికులు తా ము కోరుకునే వంటకాలను తెలియజేస్తే సరిపోతుంది. ఇలా ఆర్డర్ చెప్పిన వెంటనే పిండి వంటకాలు, ఆహార పదార్ధాలను ఈ బృందాలు అందుబాటులోకి తీసుకువస్తాయి. దీనివల్ల స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. అలాగే ఇళ్ళల్లో తినే మాదిరి పసందైన పిండి వంటకాలను రైళ్ళల్లో కూడా పొందే అవకాశం లభిస్తుంది. రైళ్ళల్లో ప్రయాణికులు తమ పిల్లలకు కొనుగోలు చేసే శీతల పానీయాలు, ఆహార పదార్థాలు కలుషితమై రోగాల బారిన పడుతున్న పరిస్థితులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంఘటనపై స్పందించిన రైల్వే చాలాకాలం నుంచి దీనిపై దృష్టిసారించింది. రైళ్లలో ఉండే ప్యాంట్రీ కార్లవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే వీటన్నింటికంటే బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఎటువంటి ఫిర్యాదులకు అవకావం లేని స్వయం సహాయక బృందాలతో తయారు చేయించే వంటకాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలో ముఖ్యమైన 50 రైల్వేస్టేషన్‌లో ఈ పథకం అమల్లోకి రావడం, ప్రయాణికుల నుంచి విశేషంగా ఆదరణ పొందడంతో ఇక నుంచి మరికొన్ని రైల్వేస్టేషన్లకు దీనిని విస్తరించాలని నిర్ణయించింది.