బిజినెస్

ఇపిఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఓ) చందాదారులు తమ డిపాజిట్లపై 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీని పొందనున్నారు. ఇపిఎఫ్ ట్రస్టు బోర్డు సభ్యులు డిసెంబర్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు. ఇపిఎఫ్ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించాల్సిందిగా కార్మిక శాఖపై ఆర్థిక శాఖ వత్తిడి తీసుకువస్తున్నట్లు జోరుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఇపిఎఫ్ వడ్డీ రేటును తగ్గించాల్సిందిగా మీపై ఆర్థిక శాఖ వత్తిడి తీసుకొస్తోందా? అని విలేఖరులు ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని, 2016-17 సంవత్సరానికి గాను ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ఇపిఎఫ్ కేంద్ర ట్రస్టు బోర్డు సభ్యులు నిర్ణయించారని, ఇందుకు గాను తాము అదనంగా 158 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుందని, దీనిపై తమ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని దత్తాత్రేయ వివరించారు. 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాల్సిందిగా ఆర్థిక శాఖను కోరామని, అవసరమైతే ఈ విషయమై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో స్వయంగా తానే మాట్లాడతానని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇపిఎఫ్ చందాదారులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వడం ఖాయమేనని, అయితే దీనిని ఎప్పుడు, ఏవిధంగా ఇవ్వాలన్నదే తేలాల్సి ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

చిత్రం..వివరాలను వెల్లడిస్తున్న బండారు దత్తాత్రేయ