బిజినెస్

తెలంగాణలో ప్లాస్టిక్ వాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించిన మరో కొత్త పారిశ్రామిక వాడ ఏర్పాటు కానుందని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. సిద్దిపేట, లేదా యాదాద్రిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. గురువారం ఈ పారిశ్రామిక వాడపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన బాలమల్లు ఈ వివరాలను వెల్లడించారు. అన్ని వౌలిక సదుపాయాలు కల్పించి క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్లస్టర్‌కు 300 ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటుతో 600 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహాయంతో పాటు విద్యుత్, పనియంత్రాలు, ముడిసరుకుపై ప్రోత్సాహాన్ని అందజేస్తామని, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని బాలమల్లు తెలిపారు.

చిత్రం..పారిశ్రామిక వేత్తలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్న టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు