బిజినెస్

‘సమ్మర్ సర్‌ప్రైజ్’ ఆఫర్ ఉపసంహరణలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: మార్కెట్ నియంత్రణా సంస్థ ట్రాయ్ ఆదేశాల ప్రకారం మూడు నెలల కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంలో రిలయన్స్ జియో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ భారతీ ఎయిర్‌టెల్ టెలికామ్ వివాదాల పరిష్కార అప్పిలెట్ ట్రిబ్యునల్ (టిడిఎస్‌ఎటి)కు ఫిర్యాదు చేసింది. ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ పేరుతో రిలయన్స్ జియో 303 రూపాయల పథకం కింద తమ ఖాతాదారులకు ఉచితంగా వాయిస్, డేటా సేవలను అందజేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్‌టెల్ ఈ తాత్కాలిక పిటిషన్‌ను దాఖలు చేసింది. అలాగే ఉపసంహరణకు ముందే సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఎంచుకున్న చందాదారులకు రిలయన్స్ జియో ఆ పథకం ప్రయోజనాలను కొనసాగించడం పట్ల కూడా ఎయిర్‌టెల్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీనిపై వివరణ కోసం ఎయిర్‌టెల్‌ను సంప్రదించగా, స్పందించేందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఎయిర్‌టెల్ ఫిర్యాదుపై గురువారం స్వల్ప విచారణ జరిపిన టిడిఎస్‌ఎటి, తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.