బిజినెస్

జూన్ 15 వరకు నిర్ణయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఈ ఏడాది జూన్ 15 వరకు ఎస్‌బిఐలో విలీనమైన బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆఫ్షన్లపై తుది నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు గురువారం ఎస్‌బిఐ చైర్మన్‌ను ఆదేశించింది. అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్, ఇతర బ్యాంకు సంఘాల అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌బిఐతో కలిసి పనిచేసే విషయమై ఆఫ్షన్లు ఇవ్వాలంటూ కేంద ఆర్థిక శాఖ, ఎస్‌బిఐ కార్పోరేట్ సెంటర్ ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీని వల్ల సబ్సిడరీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తిందని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్ వైగాయ్ తెలిపారు. సర్వీసు కండిషన్లు, పనివేళలపై స్పష్టత ఇవ్వకుండా ఆఫ్షన్లు ఎలా ఇస్తారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌బిఐ తరఫున న్యాయవాది ఎం నాగేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆఫ్షన్లపై తుది నిర్ణయం తీసుకోవాడానికి సమయం పడుతుందన్నారు. వేలాది మంది ఉద్యోగుల ఆఫ్షన్లను తనిఖీ చేయాల్సి ఉందన్నారు. అనంతరం హైకోర్టు ఆఫ్షన్లు ఇచ్చేందుకు తుది గడువును పెంచాలని, ఆఫ్షన్లపై ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.