బిజినెస్

నిరాశ పరిచిన ఇన్ఫోసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 13: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ గురువారం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే ఈ ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మదుపరులను నిరాశపరిచింది. ఫలితంగా ఆ కంపెనీ షేరు 3 శాతానికి పైగా పడిపోయింది. మరోవైపు సంస్థ తన వద్ద పేరుకుపోయిన నగదు నిల్వలనుంచి దాదాపు 13 వేల కోట్ల రూపాయలను షేర్ల బైబ్యాంక్, డివిడెండ్ చెల్లింపుల ద్వారా తన వాటాదారులకు తిరిగి చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే కేవలం 0.2 శాతం పెరిగి రూ. 3,603 కోట్లకు చేరుకోగా, రాబడి 3.4 శాతం పెరిగి రూ. 17,120 కోట్లకు చేరుకొంది. అయితే గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 2.8 శాతం తగ్గగా, రాబడి 0.9 శాతం తగ్గడం గమనార్హం. కాగా, సీజన్ పరంగా చూసినట్లయితే మాంద్యంగా ఉండే త్రైమాసికంలో ఊహించని సవాళ్లను పరిష్కరించాల్సి రావడం కారణంగా కంపెనీ ఓవరాల్ పని తీరుపై ప్రభావం పడిందని కంపెనీ సిఈఓ విశాల్ సిక్కా తెలిపారు. కాగా, 2017-2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీలో 6.5 శాతంనుంచి 8.5 శాతం మధ్య ఉండవచ్చని భావిస్తున్నట్లు సిక్కా తెలిపారు. డాలర్ల లెక్కలో చూసినట్లయితే ఇన్ఫోసిస్ నికర లాభం జనవరి-మార్చి త్రైమాసికంలో 1.8 శాతం పెరిగి 543 మిలియన్ డాలర్లకు చేరుకోగా, రెవిన్యూ 5 శాతం పెరిగి 2.5 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కాగా, మొత్తం సంవత్సరానికి చూస్తే నికర లాభం 4.3 శాతం పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోగా, రెవిన్యూ 7.4 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా, 2016-17 సంవత్సరానికి ప్రతిషేరుకు రూ.14.75లు పూర్తి డివిడెండ్‌ను చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
ఇదిలా ఉండగా,కాగ్నిజెంట్, టిసిఎస్ తరహాలోనే ఇన్ఫోసిస్ కూడా తన మిగులు నగదు నిల్వలనుంచి షేర్ల బైబ్యాక్ లేదా డివిడెండ్ల చెల్లింపుద్వారా రూ. 13 వేల కోట్ల రూపాయలను షేర్‌హోల్డర్లకు తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. కాగ్నిజెంట్ 3.4 మిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను ప్రకటించగా, టిసిఎస్ రూ. 16 వేల కోట్లు తన వాటాదారులకు తిరిగి చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ సామర్థ్యం, మార్జిన్లపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎండి రంగనాథ్ తెలిపారు. రాబోయే రెండేళ్ల కంపెనీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్ వద్ద ప్రస్తుతం దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర నగదు నిల్వలున్నాయి. ఇదిలా ఉండగా, కంపెనీ కో చైర్మన్‌గా ఇండిపెండెంట్ డైరెక్టర్ రవి వెంకటేశన్‌ను నియమించినట్లు కంపెనీ బోర్డు ప్రకటించింది.

చిత్రం..క్యు-4్ఫలితాలను ప్రకటిస్తున్న ఇన్ఫోసిస్ సిఇఓ
విశాల్ సిక్కా