బిజినెస్

తగ్గిన సిక్కా వేతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దాదాపు 43 కోట్ల రూపాయల (6.68 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) పొందిన దానితో పోల్చితే ఇది తక్కువే. సంస్థ వివరాల ప్రకారం నాడు 48.73 కోట్ల రూపాయల వేతనాన్ని తీసుకున్నారు. నిజానికి బేసిక్ సాలరీ, స్టాక్స్, వేరియబుల్ పే, రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్‌ఎస్‌యు) ద్వారా 11 మిలియన్ డాలర్ల వరకు వార్షిక ఆదాయం పొందడానికి సిక్కా అర్హులు. భారతీయ ఐటి పరిశ్రమలో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న ఉన్నతోద్యోగుల్లో సిక్కా కూడా ఒకరు. కాగా, ఈ మేరకు నిరుడు ఏప్రిల్ నుంచే ఇన్ఫోసిస్ పెంచింది. అయితే 8 మిలియన్ డాలర్ల వేరియబుల్ పేకుగాను కేవలం 3.68 మిలియన్ డాలర్లు మాత్రమే సిక్కా 2016-17లో తీసుకున్నారు. దీనికి కారణం సిక్కా వేతన పెంపుపై ఎన్‌ఆర్ నారాయణ మూర్తి తదితర సంస్థ వ్యవస్థాపకుల నుంచి విమర్శలు వ్యక్తం కావడమే. క్రింది స్థాయి ఉద్యోగులకు వేతన ప్రయోజనాలను అందించకుండా ఉన్నత స్థాయి ఉద్యోగులే ఆ ప్రయోజనాలను పొందుతున్నారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు బాహాటంగానే విమర్శిస్తున్నది తెలిసిందే. దీనిపై సంస్థ ప్రస్తుత యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు కోల్డ్‌వార్ నడుస్తున్నదీ విదితమే.