బిజినెస్

క్షీణించిన డిసిబి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ డిసిబి బ్యాంక్ లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 24 శాతం క్షీణించింది. 53 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో ఇది 70 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు డిసిబి బ్యాంక్ తెలిపింది. ఆదాయం ఈసారి 284 కోట్ల రూపాయలుగా, పోయినసారి 230 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక 2016-17లో బ్యాంక్ లాభం 307 కోట్ల రూపాయలుగా, ఆదాయం 1,046 కోట్ల రూపాయలుగా ఉంది.