బిజినెస్

సామాన్యుడి సొంతింటి కలపై సిమెంట్ ధరల పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 16: సిమెంట్ ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి గృహ నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు 280 నుండి 300 రూపాయలు పలికిన సిమెంట్ బస్తా ధర. ప్రస్తుతం 380 నుండి 390 రూపాయలకు చేరింది. అనేక గ్రామాల్లోనైతే 400 రూపాయలకుపైగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి నాలుగైదు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2013 సంవత్సరంలో ఇసుక కొరతతో ప్రారంభమైన కష్టాలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తారాస్థాయకి చేరాయ. బ్యాంకులు గృహ రుణాల వడ్డీరేట్లను తగ్గించడంతో పరిస్థితులు కాస్త అనుకూలిస్తున్నాయన్న తరుణంలో ఇప్పుడీ సిమెంట్ ధరల పిడుగు పడింది. ఫలితంగా నిర్మాణాలను చేపట్టలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచాల్సిన అవసరం లేనప్పటికీ, దురాశతో సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి, ధరలు పెంచి, నిర్మాణాన్ని శిరోభారంగా మార్చాయని, ఈ ధరలను వెంటనే అదుపుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. సిమెంట్‌ను నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకువస్తే ధరల అదుపునకు అవకాశం ఉంటుందని చిన్నతరహా బిల్డర్ దువ్వూరి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. భవన నిర్మాణం ప్రతి దశలోనూ సిమెంట్ లేకుండా పనులు జరగవని, ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకే సిమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సివిల్ ఇంజనీరు తూరిభట్ల శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రభుత్వాలు స్పందించని పక్షంలో నిర్మాణ రంగాన్ని స్తంభింపజేసి, ధరలు తగ్గేవరకు ఆందోళన సాగిస్తామని క్రెడాయ్ కాకినాడ ఛాప్టర్ ఛైర్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి రాయుడు హెచ్చరించారు.