బిజినెస్

భారత ఆర్థిక వ్యవస్థ బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 25: దేశంలో నెలకొన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ‘స్వర్ణ యుగం’గా అభివర్ణించారు ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా, బాగోలేదన్న వార్తలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సవాళ్లను ఎదుర్కొంటూ వెళ్తున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది స్వర్ణ యుగమే. ఆర్థిక గణాంకాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి.’ అని సుబ్రమణ్యన్ అన్నట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (ఐఎఫ్‌ఎమ్‌ఆర్) ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది. ఆదివారం ఇక్కడ శ్రీ సిటి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఐఎఫ్‌ఎమ్‌ఆర్ స్నాతకోత్సవానికి సుబ్రమణ్యన్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సుబ్రమణ్యన్.. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్న వార్తలను విశ్వసించవచ్చని విద్యార్థులను కోరారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యానని, అపజయాలకు కుంగిపోరాదని కూడా విద్యార్థులకు ఆయన హితబోధ చేశారు. కాగా, గత వారం కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై సుబ్రమణ్యన్ మాట్లాడుతూ రాబోయే మూడేళ్ళలో భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతాన్ని అందుకుంటుందని చెప్పినది తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో దేశ జిడిపి వృద్ధి 7-7.75 శాతంగా ఉంటుందని అంచనా వేశామన్న ఆయన మరో మూడేళ్లలో ఇది 8-10 శాతానికి చేరుకోగలదన్నారు.