బిజినెస్

జన్ ధన్ ఖాతాల్లో మళ్లీ పెరుగుతున్న నగదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ ధన్ ఖాతాల్లో నగదు నిల్వలు అమాంతం పెరిగిపోయినది తెలిసిందే. రోజులు గడుస్తున్నకొద్దీ రద్దయిన నోట్ల స్థానంలో వచ్చిన కొత్త కరెన్సీని ఖాతాదారులు నెమ్మదిగా ఉపసంహరించుకోవడంతో ఆ నగదు నిల్వలు కాస్తా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించినది తెలిసిందే. కాగా, ఇప్పుడు మళ్లీ జన్ ధన్ ఖాతాల్లోకి డిపాజిట్లు పెరుగుతుండటం విశేషం. ఈ నెల 5తో ముగిసిన వారంలో వెయ్యి కోట్ల రూపాయలు రాగా, మొత్తం జన్ ధన్ ఖాతాల్లో ఉన్న నగదు విలువ 63,971.38 కోట్ల రూపాయలను చేరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే.
కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తీసుకురాగా, రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను పొందవచ్చని ప్రకటించారు. అయితే అప్పటిదాకా అంతంతమాత్రంగా ఉన్న జన్ ధన్ ఖాతాల్లోని నగదు నిల్వలు ఒక్కసారిగా పెరగడం మొదలైంది. డిసెంబర్ 7 నాటికి 74,610 కోట్ల రూపాయల నగదు నిల్వలున్నట్లు తేలింది. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో నిరుపేదల కోసం ఈ జన్ ధన్ ఖాతాలను బ్యాంకుల ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెరిపించింది. కానీ పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమార్కులు వీటిని వినియోగించుకోవడంతో ఆ ఖాతాల్లో నగదు నిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వీటన్నిటిపై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదతర ఏజెన్సీలు విచారణలు జరుపుతున్నాయి.