బిజినెస్

సోలార్ పెట్టుబడులకు టి-ఐడియా ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు సోలార్ విద్యుత్ రంగానికి ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సోలార్ విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, టి-ఐడియా పథకం కిందకు ఈ రంగాన్ని తీసుకు వచ్చి టి-ఐడియా కింద పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు సోలార్ విద్యుత్ రంగానికి ఇవ్వాలని నిర్ణయించారు. సోలార్ పెట్టుబడులను రినెవబుల్ ఎనర్జీ పెట్టుబడులను టి-ఐడియా పథకం కిందకు తీసుకు వచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రాంలో పెట్టుబడులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం అయింది. మంత్రులు కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. టియస్‌ఐపాస్ అమలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం వంటి అంశాలపైన నిర్ణయాలు ఉప సంఘం తీసుకుంది. 200 కోట్ల రూపాయల పెట్టుబడి లేదా 1000 ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టుగా ఇప్పటి దాకా ఉన్న నిర్వచనంలో భూమి విలువను సైతం కలిపేందుకు మంత్రివర్గ సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు. అయితే మెగా ప్రాజెక్టులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, కంపెనీల ఉత్పత్తి ఆధారంగా విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు. జిఎస్‌టి అమలు నేపథ్యంలో టి-ఐడియా ద్వారా ఇచ్చే పన్ను రాయితీలను పునర్ నిర్వచించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయితీరాజ్ సంస్థలలకు చట్ట ప్రకారం ఫీజులను చెల్లించి, అనుమతులు పోందవచ్చునని మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. దీని కోసం తీసుకోవలసిన చర్యలపై పంచాయితీరాజ్ కమీషనర్ శాఖాపరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. నాలా కన్వర్షన్ విధానంలోనూ మరింత ఈజీ డూయింగ్ బిజినెస్ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. కన్వర్షన్ ఫీజులను టియస్ ఐ పాస్ దరఖాస్తు సమయంలోనే ఫీజు చెల్లించిన తరువాత ఏడు పని దినాలు దాటిన తర్వాత డీమ్డ్ అప్రూవల్ పద్దతిలో అనుమతి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సిఎంఓ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల కమీషనర్ నదీమ్ ఆహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై చర్చిస్తున్న తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం