బిజినెస్

పెట్రో డీలర్ల నిర్ణయాన్ని గర్హించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేయాలని కొంత మంది యజమానులు, ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని పెట్రోల్ పంపుల యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని చమురు మంత్రిత్వ శాఖ తీవ్రంగా గర్హించింది. ఈ నిర్ణయం వలన సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని స్పష్టం చేసింది. దిగుమతులపై దేశం ఎక్కువగా ఆధారపడకుండా చూసేందుకు వారం లో ఒక రోజు ఇంధన వినియోగాన్ని మానుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తికి భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం వక్రభాష్యం చెప్పడం పట్ల చమరు శాఖ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంధాన్ని పొదుపు చేయాలన్న లక్ష్యంతోనే మోదీ ఈ విజ్ఞప్తి చేశారని, అంతే తప్ప పెట్రోల్ పంపులను మూసివేయాల్సిందిగా వాటి యజమానులకు మోదీ సూచించలేదని చమురు శాఖ పేర్కొంది. ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలన్న నిర్ణయాన్ని తాము పాటించబోమని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. దేశంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన 53,224 పెట్రోల్ పంపుల్లో దాదాపు 80 పంపులకు ఈ సంఘం ప్రాతినిథ్యం వహిస్తోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తమకు ఎక్కువ కమిషన్ చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్టల్రోని మరికొన్ని ప్రాంతాల పెట్రోలియం డీలర్లు మే 14వ తేదీ నుంచి ప్రతి ఆదివారం తమ బంకులను మూసివేయాలని నిశ్చయించుకున్నారు. అయితే ఈ నిర్ణయానికి తాము సమ్మతించడం గానీ ఆమోదం తెలపడం గానీ చేయలేదని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.