బిజినెస్

ఇపిఎఫ్‌పై 8.65% వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత (2016-17) ఆర్థిక సంవత్సరానికి గాను ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం వెల్లడించారు. ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ట్రస్టు బోర్డు సభ్యులు గత ఏడాది డిసెంబర్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇపిఎఫ్ వడ్డీ రేటును తగ్గించాల్సిందిగా కార్మిక మంత్రిత్వ శాఖపై ఆర్థిక శాఖ వత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు రావడంతో ట్రస్టు బోర్డు నిర్ణయించిన 8.65 శాతం కంటే తక్కువ వడ్డీ పొందాల్సి వస్తుందని అసంఘటిత రంగ కార్మికులు ఆందోళనకు గురయ్యారు. అయితే గురువారం దత్తాత్రేయ చేసిన ప్రకటనతో ఈ భయాందోళనలన్నీ తొలగిపోయాయి. ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని తెలియజేయడంతో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈ వడ్డీని దాదాపు నాలుగు కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుకలుగుతుంది. ఇపిఎఫ్ వడ్డీ రేటుపై ఆర్థిక, కార్మిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు ముగిశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వు త్వరలోనే వెలువడుతుంది. ఆ వెంటనే నిర్ధేశిత 8.65 శాతం వడ్డీని నాలుగు కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేస్తాం’ అని దత్తాత్రేయ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన నేషనల్ సేఫ్టీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు చట్టాన్ని సవరించి, టాక్స్ ఫ్రీ గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసి 20 లక్షల రూపాయలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదం నిమిత్తం త్వరలో కేంద్ర మంత్రి వర్గం ముందు ఉంచుతామని ఆయన తెలిపారు.
కార్మికులకు అన్ని విధాలా భద్రత..
కార్మికుల సంక్షేమానికి ఎన్‌డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలోని ప్రతి కార్మికుడికి ఉద్యోగ, వేతన, సామాజిక, ఆరోగ్య భద్రత కల్పిస్తామని దత్తాత్రేయ ప్రకటించారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కార్మికుల భద్రతకు యాజమాన్యాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దత్తాత్రేయ సూచించారు. కార్మికులకు వృత్తిపరమైన భద్రత కల్పించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జాతీయ భద్రతా సమాఖ్య, రెడ్డి లాబ్స్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఈసమావేశానికి అధ్యక్షత వహించారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసే సంస్థలకు ఎన్‌ఎస్‌సిఐ భద్రతా అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే.

చిత్రం..ఇపిఎఫ్ వడ్డీ వివరాలను ప్రకటిస్తున్న దత్తాత్రేయ