బిజినెస్

600 మంది ఉద్యోగులపై విప్రో వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో మూడవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన విప్రో తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయింది. తమ ఉద్యోగుల ‘ప్రతిభా మదింపు’ తర్వాత వందలాది మందికి ఉద్వాసన పలకడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నప్పటికీ ఈ సంఖ్య 2 వేల వరకూ పెరగవచ్చని తెలుస్తోంది. 2016 డిసెంబర్ చివరి నాటికి విప్రోలో 1.79 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. కాగా, ఈ విషయమై విప్రోను సంప్రదించగా, సమర్థులను ప్రతిభావంతులను అనే్వషించే క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ సంస్థ తెలిపింది. అంతేకాకుండా సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, క్లయింట్ల అవసరాలకు ప్రాధాన్యత కొనసాగుతుందని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ సంఖ్యలో ఏడాదికేడాది తేడా ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ‘ప్రతిభ మదింపులో కొంతమంది ఉద్యోగులను వేరుచేయడం జరుగుతుంది. ప్రతి ఏటా వీరి సంఖ్య ఎంతో కొంత ఉంటుంది’ అని విప్రో అధికారి ఒకరు చెప్పారు. అయితే తొలగించే ఉద్యోగుల సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందో మాత్రం ఆయన చెప్పలేదు. కాగా, విప్రో ఈ నెల 25న తన నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సరపు ఫలితాలను వెల్లడించనుంది.