బిజినెస్

నాల్కోలో 9.2% వాటా విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్ (నాల్కో)లో 9.2 శాతం వాటాను విక్రయించడం ద్వారా 1200 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమకూర్చుకుంది. రిటైల్ ఇనె్వస్టర్లతో పాటుగా సంస్థాగత మదుపరులకు ఈ వాటాలను ప్రభుత్వం విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన తొలి పిఎస్‌యు పెట్టుబడుల ఉపసంహరణ ఇదే కావడం గమనార్హం. ప్రభుత్వం మొట్టమొదట 5 శాతం వాటాలను విక్రయించే ఉద్దేశంతో బుధవారం మార్కెట్లోకి వచ్చింది. అయితే షేర్ల విక్రయం రోజున మదుపరుల డిమాండ్ ఎక్కువ ఉండడం చూసి గ్రీన్‌షూ అప్షన్‌ను ఉపయోగించుకుని అదనంగా మరిన్ని షేర్లను విక్రయించింది. సంస్థాగత ఇనె్వస్టర్లకోసం కేటాయించిన షేర్లకు 1.84 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు రావడంతో ఈ షేర్ల విక్రయం ద్వారా 954 కోట్ల రాబడి వచ్చింది. కాగా, రిటైల్ ఇనె్వస్టర్లకోసం కేటాయించిన షేర్లకు 3.17 శాతం ఎక్కువ బిడ్లు రాగా వాటి ద్వారా మరో 250 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండు మొత్తాలు కలిపితే రూ.1200 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నాల్కోలో ఉన్న 74.58 శాతం వాటాలోంచి ప్రభుత్వం 9.2 శాతం వాటాను షేరుకు రూ. 67 చొప్పున విక్రయించింది.