బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 159.21 పాయింట్లు క్షీణించి 25,678.93 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 44.25 పాయింట్లు పడిపోయి 7,855.05 వద్ద నిలిచింది. అమెరికా ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశాల క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న బలహీన సంకేతాలు.. భారతీయ సూచీలను దెబ్బతీశాయి. గురువారంతో ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. కాగా, స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లో ముగిసినది తెలిసిందే. ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ సెనె్సక్స్ 42 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయాయి.
ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
న్యూఢిల్లీ: విదేశీ మదుపరులు ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు అమితాసక్తిని కనబరిచారు. సోమవారం సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు నిర్వహించిన వేలంలో 4,818 కోట్ల రూపాయల విలువైన బాండ్లకుగాను 5,576 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.