బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: త్రైమాసిక ఫలితాలు వెలువడుతుండడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు రోజులుగా నష్టాల్లో కొనసాగుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు కూడా మదుపరుల కొనుగోళ్లకు ఊతమివ్వడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 86 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 332 పాయింట్లు లాభపడింది. బుధవారం సెనె్సక్స్ స్వల్పంగా లాభపడగా, నిఫ్టీ నష్టాల్లో ముగియడం తెలిసిందే. కాగా, గురువారం మాత్రం దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల ఊపు కనిపించింది. ప్రధాన షేర్లలో పెద్దగా కొనుగోళ్లు జరక్క పోయినప్పటికీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ప్రారంభంలోనే బలంగా మొదలైన సెనె్సక్స్ 29,453.06-29,341.68 పాయింట్ల మధ్య ఊగిసలాడుతూ చివరికి 85.82 పాయింట్ల లాభంతో 29,422.39 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం రోజంతా లాభాల్లో కొనసాగి చివరికి 32.90 పాయింట్ల లాభంతో 9,136.40 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో లాభపడిన రూపాయి తన లాభాల్లో కొంతమేరకు కోల్పోయిన నేపథ్యంలో ఐటి స్టాక్స్ పుంజుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటినుంచి దాదాపు 5 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ షేరు ఈ రోజు 096 శాతం లాభపడింది. అలాగే టిసిఎస్ 1.16 శాతం, విప్రో షేరు 0.36 శాతం పెరిగింది. కాగా, యెస్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు భాగానే పెరిగినప్పటికీ నిరర్థక ఆస్తులు పెరిగిన నేపథ్యంలో ఆ బ్యాంక్ షేరు 3.76 శాతం పడిపోయింది. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు కూడా దాదాపు 2.90 శాతం నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగియగా, 9 మాత్రం నష్టాలు చవి చూశాయి. కాగా, ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. ఐరోపా మార్కెట్లలో పారిస్, ఫ్రాంక్‌ఫర్ట్ సూచీలు ప్రారంభంలో లాభాల్లో సాగగా, లండన్ ఎఫ్‌టిఎస్‌సి నష్టాల్లో సాగింది.
ఇదిలా ఉండగా ఈ నెల 26నుంచి బిఎస్‌ఇకి చెందిన నెక్ట్స్ 50 ఇండెక్స్‌నుంచి యునైటెడ్ స్పిరిట్స్, కైర్న్ ఇండియాలను తొలగించి వాటి స్థానంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి, హావెల్స్ ఇండియా సంస్థలను చేర్చనున్నట్లు బిఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది.