బిజినెస్

వడ్డీ రేట్లు తగ్గించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మరింత తగ్గించడానికి అవకాశముందని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీకి తెలియజేశారు. అయితే రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నెల 6న జరిపిన ద్రవ్య పరపతి విదానం సమీక్షలో ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధానం సమీక్షా కమిటీ (ఎంఎన్‌సి)ప్రధాన వడ్డీ రేటయిన రెపో రేటును యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. ‘అయితే బ్యాంకులు మరింతగా వడ్డీ రేట్లను తగ్గించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే సమర్థవంతమైన కార్యకలాపాల కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థలోని ఇతర పోల్చదగ్గ పథకాల వడ్డీ రేట్లకన్నా భిన్నంగా ఉండకూడదు’ అని పటేల్ చెప్పినట్లు ఆర్‌బిఐ గురువారం విడుదల చేసిన ఎంఎన్‌సి మినిట్స్‌లో పేర్కొన్నారు. 2015 జనవరినుంచి ఇప్పటివరకు ఆర్‌బిఐ 1.75 శాతం తన ప్రధాన వడ్డీ రేట్లను తగ్గించగా, బ్యాంకులు మాత్రం 0.85-90 శాతం మాత్రమే తగ్గించాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక కార్యక్రమాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక వృద్ధి దెబ్బతినకుండా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్నది ఆర్‌బిఐ లక్ష్యం. అయితే రాబోయే నెలల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉండనున్నప్పటికీ ద్రవ్యోల్బణం పట్ల మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉర్జిత్ పటేల్ అభిప్రాయ పడ్డారు.