బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.09 పాయింట్లు కోల్పోయి 29,365.30 వద్ద నిలవగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు దిగజారి 9,119.40 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న మిశ్రమ సంకేతాల మధ్య మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. నిజానికి ఉదయం ఆరంభంలో భారీ లాభాల వైపు వెళ్లిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, మెటల్, ఆటో, ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా చూసినట్లైతే సెనె్సక్స్ 96.15 పాయింట్లు, నిఫ్టీ 31.40 పాయింట్లు పడిపోయాయి.
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో వారం. కాగా, ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ నష్టపోగా, జపాన్, చైనా సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు పడిపోయాయి.