బిజినెస్

135 ఏళ్లలో తొలిసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 22: కాలుష్య కాసారంగా మారిన విద్యుదుత్పాదక రంగాన్ని పర్యావరణ సహితంగా మార్చే దిశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 135 ఏళ్ల తర్వాత తొలిసారిగా థర్మల్ విద్యుదుత్పత్తిని పూర్తిగా ఒకరోజు నిలిపివేసింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి లేకుండానే తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోగలిగింది. పారిశ్రామిక విప్లవం నాటి నుంచి ఇలా థర్మల్ విద్యుదుత్పత్తిని ఆపేయడం ఇదేనని బ్రిటన్ నేషనల్ గ్రిడ్ తెలియజేసింది. శుక్రవారం ఈ ఘనతను సాధించినట్లు పేర్కొంది. వాతావరణంలో కర్బన ఉద్గారాల మోతాదు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో దాన్ని తగ్గించడానికి 2025కల్లా విడతల వారీగా పూర్తిగా థర్మల్ ప్లాంట్లను మూసేయాలని బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ‘వాటర్‌షెడ్’ ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగానే శుక్రవారం థర్మల్ విద్యుదుత్పత్తికి విరామం ఇచ్చింది. 1882లో లండన్‌లోని హాల్‌బర్న్ వయడక్ట్ వద్ద ప్రపంచంలోనే తొలి సెంట్రలైజ్డ్ పబ్లిక్ కోల్-ఫైర్డ్ జనరేటర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్యుత్ వెలుగుల కోసం బొగ్గు మండుతూనే ఉంది. పారిశ్రామికంగా దూసుకెళ్తున్న బ్రిటన్.. విద్యుత్ అవసరాలకు బొగ్గుపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే ఇది భవిష్యత్ తరాల ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతుండటాన్ని గమనించిన ఆ దేశం.. విద్యుదుత్పత్తిలో బొగ్గు వినియోగాన్ని తగ్గించాలని నిశ్చయించుకుంది. 2012లో బ్రిటన్‌లో 17 థర్మల్ విద్యుత్ ప్లాంట్లుండగా, అవి 23 గిగావాట్ల విద్యుదుత్పత్తిని చేశాయి. ఇది బ్రిటన్ మొత్తం గరిష్ఠ విద్యుత్ అవసరాల్లో దాదాపు సగంతో సమానం. అయితే ఆమ్ల వర్షాల దృష్ట్యా యూరోపియన్ యూనియన్ అమలు పరచిన నిబంధనలు, బ్రిటన్ ప్రభుత్వం విధిస్తున్న కార్బన్ ట్యాక్స్‌తో 2013లో చాలావరకు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు మూతబడ్డాయి. ఈ క్రమంలో బొగ్గేతర విద్యుదుత్పత్తి అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా 8 థర్మల్ ప్లాంట్ల లో విద్యుదుత్పత్తి అవుతుండగా, వీటిద్వారా 14 గిగావాట్ల ఉత్పత్తి వస్తోంది. వీటిని కూడా 2025 నాటికి క్రమేణా మూసేయాలని బ్రిటన్ గట్టిగా భావిస్తోంది. సహజవాయువు, అణు, సౌర, జల, పవన తదితర పునరుత్పాదక మార్గాల్లో 100 శాతం విద్యుదుత్పత్తిని అందుకోవాలనుకుంటోంది. ఇందుకు ఈ తరహా విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను కూడా బ్రిటన్ దండిగానే ప్రకటిస్తోంది. నిరుడు మొత్తం బ్రిటన్ విద్యుదుత్పత్తిలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి వాటా 42.4 శాతంగా ఉండగా, న్యూక్లియర్ విద్యుదుత్పత్తి 21.2 శాతం, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 24.4 శాతం విద్యుదుత్పత్తి జరిగింది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తి 10 శాతం దరిదాపుల్లోకి పడిపోయినట్లైంది. మొత్తానికి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి బ్రిటన్ బైబై చెప్పాలనుకుంటుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. భారత్ కూడా ఇప్పుడిప్పుడే సోలార్ పవర్‌పై దృష్టి సారిస్తున్నది తెలిసిందే.

చిత్రం..రాత్రివేళ విద్యుత్ కాంతుల్లో లండన్ మహా నగరం