బిజినెస్

ఆక్వా రైతుకు భానుడి ‘గండం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 22: భానుడి భగభగలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసే రైతాంగం బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే రొయ్య రైతులను వివిధ రకాల వైరస్ పీడ వెంటాడుతుండగా, తాజాగా అధిక ఉష్ణోగ్రత శాపంలా మారింది. చేపల చెరువులు సాగుచేసేవారి పరిస్థితి కూడా ఇదేవిధంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ చెరువుల్లోని చేపల్లో నాణ్యత తక్కువగా ఉంటోందని చేపల మార్కెట్‌కు కీలకమైన అసోం, పశ్చిమ బెంగాల్ ట్రేడర్లు కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో చేప ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా చేపలు చనిపోయి తేలిపోతుండటంతో రైతుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది.
రొయ్యల సాగు విషయానికివస్తే చెరువుల్లో సాగు చేసే రొయ్యలకు డిఒ అంటే ఆక్సిజన్ చాలా కీలకం. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినప్పుడు ఆక్సిజన్ శాతం పడిపోతోంది. దీంతో ఏరియేటర్ల ద్వారా చెరువులో ఆక్సిజన్ శాతాన్ని నిలబెడతారు. కాగా, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని రొయ్య రైతులు ఈ ఏడాది మార్చిలో రెండవ పంట సాగు ప్రారంభించారు.
శీతాకాలం పంటకు ఆశించిన ఫలితం దక్కడంతో వేసంగిపై ఆశలు పెట్టుకుని ముందస్తు వ్యూహంతో మార్చిలోనే చెరువుల్లో పిల్లను వేశారు. కానీ అధిక ఉష్ణోగ్రతల వల్ల రాత్రి వేళల్లో మాత్రమేగాకుండ ఉదయం వేళల్లో కూడ డిఒ పడిపోతోంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక రైతులంతా ఏరియేటర్ల సంఖ్య పెంచారు. అయనప్పటికీ ప్రయోజనం లేకపోతోంది.
ఎకరానికి 2హెచ్‌పి మోటార్లు 10 ఏర్పాటుచేసినా ఫలితం శూన్యం అని రైతులు వాపోతున్నారు. ఫలితంగా రన్నింగ్ మోర్టాలిటీతో రొయ్యలు మృత్యువాత పడి చెరువు అడుగున మట్టిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే నెల తలుచుకుంటేనే భయమేస్తోందని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎకరానికి కనీసం 5 లక్షల రూపాయలు నష్టం వచ్చే అకాశాలు కనిపిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
మరోవైపు చేపల చెరువుల విషయానికి వస్తే సాధారణంగా చేపల చెరువులు 10 నుంచి 18 అడుగుల వరకు తవ్వుతారు. దీనివల్ల చెరువులోని చేపకు వాతావరణ మార్పులవల్ల ఎటువంటి ఇబ్బంది ఉండడు. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో చేపలపైనా ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండ దెబ్బకు చేపలు చనిపోయి చెరువులో తేలిపోతున్నాయి.
గతంలో ఒక పంటకు 10 నెలల పాటు సాగు చేసేవారు. అయితే ఇటీవల చేపకు డిమాండ్ ఉండటంతో ఆరు మాసాలకోసారి అంటే ఏడాదికి రెండు పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అన్ని చెరువులు చేపలతో కళకళలాడుతున్నాయి. ఈ సమయంలో భానుడి ప్రతాపం కారణంగా లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.
ఇదిలావుంటే చెరువుల్లో నీటిని మార్చుకుంటూ, ఆక్సిజన్ పరిమాణం తగిన విధంగా ఉండేలా ఏరియేటర్లు ఏర్పాటు చేసుకోవాలని మత్స్యశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. నీటి పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకుంటే అధిక ఉష్ణోగ్రతల్లో చేపల సాగు గట్టెక్కుతుందని సలహాలు ఇస్తున్నారు.

చిత్రాలు..అధిక ఉష్ణోగ్రతలతో చెరువులో చనిపోయ తేలిన చేపలు, నీటిలో ఆక్సిజన్ పెంచడానికి రొయ్యల చెరువులో నిరంతరాయంగా పనిచేస్తున్న ఏరియేటర్లు