బిజినెస్

స్టార్టప్‌లకు సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 22: స్టార్టప్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, రానున్న రోజుల్లో విశాఖలో పెద్ద ఎత్తున ఫిన్‌టెక్ వాలీలో అంకుర సంస్థల ఏర్పాటుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి వెల్లడించారు. గీతం యూనివర్శిటీలో శనివారం జరిగిన క్రిప్టో కరెన్సీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటి రంగంపై మోజుతో సామాన్య శాస్త్రాలను నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా డిజిటల్ యుగంలో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, స్టాటస్టిక్స్, అనలిటిక్స్ వంటివి అధ్యయనం చేసినప్పుడే ఐటి రంగంలో కొత్త మార్పులను అందుకోగలమన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో క్రిప్టో కరెన్సీ ప్రాధాన్యత సంతరించుకుంటోందని, ముఖ్యంగా ఐటి రంగంలో జరిగే ఆర్థిక లావాదేవీలకు ముప్పు వాటిల్లకుండా ఉపయోగపడుతుందన్నారు. దీనిపై త్వరలోనే విశాఖ ఫిన్‌టెక్ వాలీ.. కోల్‌కత్తాలోని ఆర్‌సి బోస్ సెంటర్ ఫర్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌టి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక రంగంలో బ్యాంకింగ్‌సహా అన్ని వ్యవస్థలు డిజిటలైజేషన్‌తో ముందుకు సాగుతున్నాయని, కరెన్సీ నోట్లతో సమానంగా వర్చువల్ కరెన్సీ వినియోగంలో ఉందన్నారు.
ఆర్థిక నియంత్రణ సంస్థల ప్రమేయం ఉన్నా.. లేకున్నా భవిష్యత్‌లో క్రిప్టో కరెన్సీ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక రంగంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం పెరుగుతోందని తెలిపారు. క్రిప్టో కరెన్సీ వినియోగంతోపాటు సైబర్ సెక్యూరిటీ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి షీల మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటివి ఆర్థిక భద్రతకు ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. గీతం ఫిన్‌టెక్ అకాడమీ ద్వారా ఫిన్‌టెక్ వాలీకి అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ స్టాటస్టికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఆర్‌సి బోస్ సెంటర్ ఫర్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ విభాగాధిపతి ప్రొఫెసర్ బిమల్ రాయ్ కరెన్సీ ప్రాధాన్యతను వివరించారు.

చిత్రం..గీతం యూనివర్శిటీలో మాట్లాడుతూన్న చౌదరి