బిజినెస్

ఈసారి వృద్ధిరేటు 7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతానికి పెరుగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.1 శాతంగా నమోదైన నేపథ్యంలో అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, ఆర్థిక క్రమశిక్షణ, లోటు వంటివి జిడిపిని 7.5 శాతానికి పెంచడానికి దోహదపడగలవన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం జైట్లీ అమెరికా పర్యటనలో ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలో విడుదలైన ఓ అధికారిక ప్రకటన ఈ మేరకు తెలియజేసింది. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో జైట్లీ పాల్గొంటారు. జైట్లీతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. కాగా, ఈ సందర్భంగా జరిగిన స్వాగత కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ భారత్‌లో తొలిసారిగా ఆర్థిక సంస్కరణలకు ప్రజల నుంచి విశేష సహకారాన్ని చూస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వపక్షాన ప్రజలు నిలబడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన రక్షణ రంగ సంస్థలు భారత్‌లో ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఆర్థిక మంత్రులను జైట్లీ ఇక్కడ కలిశారు. వారితో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.