బిజినెస్

బొగ్గు గని కార్మికులకు ఆధార్ నెంబరే పిఎఫ్ నెంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: బొగ్గు గనుల్లో (కోల్ మైన్) పనిచేసే కార్మికులకు ఆధార్ సంఖ్యే పిఎఫ్ నెంబర్‌గా పరిగణించనున్నట్లు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సిఎమ్‌పిఎఫ్) కమిషనర్ బికె పాండా తెలిపారు. కోల్‌మైన్ పిఎఫ్ పెన్షనర్లు నూతన జీవన్ ప్రమాణ్ కార్యక్రమంలో భాగంగా వారి బొటన వేలి గుర్తుతో కూడిన లైఫ్ సర్ట్ఫికెట్‌ను దాఖలు చేయవచ్చని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాండా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పెన్షనర్లు వారి ఆధార్ వివరాలను నమోదు చేయడం కోసం దేశవ్యాప్తంగా జాగృతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు భూపాలపల్లిలోనూ జీవన్ ప్రమాణ్ జాగృతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పెన్షనర్లు వారి లైఫ్ సర్ట్ఫికెట్‌ను దాఖలు చేయడానికి పెన్షన్ డిస్‌బర్సింగ్ అథారిటీ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదని, తగిన యాప్ ఉన్న ఏ సిస్టమ్ ద్వారానైనా లేదా ఇ-సేవా కేంద్రం ద్వారా ఎక్కడి నుంచైనా డిజిటల్ మాద్యమంలో వారి లైఫ్ సర్ట్ఫికెట్‌ను దాఖలు చేయవచ్చని ఆయన వివరించారు. పెన్షనర్ల ఇబ్బందులను తొలగించేందుకు త్వరలో కొత్త పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు పాండా తెలిపారు.