బిజినెస్

శ్రీసిటీలో ‘క్యాడ్‌బరీ’ పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాలెం, ఏప్రిల్ 25: మాండలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆసియా-పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రం మొదటి దశను చిత్తూరు, నెల్లూరు సరిహద్దు శ్రీసిటీ సెజ్‌లో సోమవారం ప్రారంభించింది. 190 మిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంటు సంవత్సరానికి 60 వేల టన్నుల క్యాడబరీ డెయిరీ మిల్క్ చాక్లెట్లను ఉత్పత్తి చేయనుంది. మూడు దశల్లల్లో 2020 నాటికి ఈ మల్టీ కేటగరి ఫుడ్ క్యాంపస్ సుమారుగా 2,50,000 టన్నుల వార్షికోత్పత్తిని చేరుకుంటుందని అంచనా. తద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో మాండలెజ్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటడ్ సప్లయ్ చెయిన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ మైర్స్ మాట్లాడుతూ నేటి, రేపటి వినియోగదారుల అవసరాలను తీర్చగలిగేలా అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రాన్ని శ్రీసిటీలో నెలకొల్పామన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 40 సామర్థ్యపూరిత, సరళవంతమైన లైన్స్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో పెట్టుబడి పెట్టామన్నారు. పవర్ బ్రాండ్స్ వృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తున్న తమ ఉత్పత్తుల కేంద్రాల్లో భాగంగా శ్రీసిటీలో నెలకొల్పినట్లు ఆయన అన్నారు. మాండలెజ్ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ ఈవీపీ, అధ్యక్షుడు వౌరి జియో బ్రూసాడెల్లి మాట్లాడుతూ భారత్ తమకు ఎంతో ప్రాధాన్యమైన మార్కెట్ అన్నారు. సుస్థిర ఆదాయ అభివృద్ధి సాధించేందుకు తమ బ్రాండ్స్, మార్కెట్ మూలాలు, సిబ్బందిపై పెట్టుబడిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 30 బిలియన్ డాలర్ల విలువైన గ్లోబ్ స్నాకింగ్ పవర్‌హౌస్‌గా మాండలెజ్ ఇంటర్నేషనల్ భారత్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, తమ నైపుణ్యాన్ని, నాణ్యతను మార్కెట్ చేసుకునేందుకు వీలుగా తమ బ్రాండ్లు, మార్కెట్ మార్గాల ద్వారా కూడా అంకితభావాన్ని చాటుకుంటామన్నారు. భారత మార్కెట్‌పై తమకు ఎన్నో ఆశలు ఉన్నాయని, మా ఆశలు ఈ దేశంలో సాకారమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేడు పెట్టుబడులు పెడుతూ రేపటి కోసం సామర్థ్యాన్ని నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవౌళి వెంకటేశన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా విధానానికి, ఉద్యోగాల కల్పనకు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను తీసుకువచ్చేందుకు ఇదో చక్కటి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. తమ బహుళ ఉత్పత్తి తయారీ కేంద్రం భారత్ తోపాటు, రీజనల్ మార్కెట్లకు సేవలను అందించనుందని చెప్పారు. ఈ దేశంలో తమ విజయాల సుదీర్ఘ చరిత్రను నిర్మించుకునేందుకు ఇది తోడ్పడుతుందంటూ ఇందుకు మద్దతుగా నిలిచిన ఏపి ప్రభుత్వానికి, శ్రీసిటీకి ధన్యవాదాలు తెలిపారు.

చిత్రం శ్రీసిటీలోని క్యాడ్‌బరీ మాండలేజ్ పరిశ్రమ భవనం, ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు