బిజినెస్

యూనివర్సిటీల్లో అరకు కాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 27: అరకు కాఫీ రుచులు విశ్వవిద్యాలయాల విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జిసిసి బ్రాండ్‌తో కూడిన అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లను యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ, మిలీనియం సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా ఎయులోనూ, మరికొన్ని విద్యాసంస్థలకు అందుబాటులో ఉండేలా విశాఖ ఉషోదయ జంక్షన్ వద్ద అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఇదే తరహాలో ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో జిసిసి బ్రాండ్ అరకు కాఫీ ప్రత్యేక స్టాళ్ళను ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. గత ఏడాది లక్ష కాఫీ ప్యాకెట్లను విక్రయించడం ద్వారా దాదాపు కోటిన్నర రూపాయల వ్యాపారాన్ని జిసిసి సాధించింది. రెండు కోట్ల లక్ష్యానికి గాను 80 శాతం మేర సాధించగలిగిన సంస్థ ఈ ఏడాది దీనిని రెట్టింపు చేయాలని నిర్ణయించిందని సంస్థ ఎండి ఎఎస్‌పిఎస్ రవిప్రకాష్ ఆంధ్రభూమికి గురువారం తెలిపారు. యూనివర్సిటీల్లో కాఫీ అమ్మకాలు సాగించడం ద్వారా దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఏపీలో విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన అరుకు కాఫీ ఇప్పటికే దేశీయ మార్కెట్‌లోకి వెళ్ళగలిగిందన్నారు. యూనివర్సిటీల్లో నిర్వహించే స్టాళ్ళలో అక్కడికక్కడే కాఫీ పౌడర్ తయారు చేస్తారన్నారు. ఇదే తరహాలో కార్పొరేట్ సంస్థలు, ప్రముఖ విద్యాసంస్థలు, మాల్స్ తదితర చోట్ల ప్రత్యేక స్టాళ్ళను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గిరిజన రైతుల నుంచి కాఫీ గింజలు కొనుగోలు చేయడం ద్వారా వారికి గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఈ విధంగా బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే కాఫీ ప్రాజెక్టు వలన గత ఏడాది 4,400 మంది గిరిజన రైతులకు 11 కోట్ల మేర ఆదాయాన్ని కల్పించామన్నారు. ఈ ఏడాది నుంచి దీనిని మరింతగా పెంచుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వేసవి తాపాన్ని తీరుస్తున్న జిసిసి షర్బత్‌లు
వేసవి తాపాన్ని తీర్చే నన్నారి, బిల్వ పేర్లతో కూడిన షర్బత్‌లకు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని జిసిసి ఎండి తెలిపారు. గత ఏడాది కోటి రూపాయలకు పైగానే వీటి ద్వారా వ్యాపారం చేయగా, ఈ ఏడాది ఇప్పటికే కోటి రూపాయలకు పైగానే షర్బత్‌ల అమ్మకాలు సాగించగలిగామన్నారు. ఈ వేసవి సీజన్‌లో మొబైల్ వాహనాల ద్వారా షర్బత్ అమ్మకాలు సాగించాలని నిర్ణయించామని, ఈ విధానం వలన సాధారణ వినియోగదారులు వీటిని పొందగలరన్నారు. అలాగే ఫ్రూటీల మాదిరి మార్కెట్‌లోకి నన్నారి, బిల్వ షర్బత్‌ల టెట్రాప్యాకెట్ల తరహాలో మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నామన్నారు.

చిత్రం..జిసిసి ఎండి రవిప్రకాష్