బిజినెస్

తెలంగాణలో ఖాయిలా పడిన పరిశ్రమలకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఖాయిలా పడిన పరిశ్రమలకు శుభవార్త. రాష్ట్రంలో అనేక కారణాల వల్ల ఖాయిలాపడిన పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ జీవో 26ను జారీ చేసింది. ఈ క్లినిక్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్ధగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్ధ ద్వారా హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి వంద కోట్ల నిధులను కేటాయించారు. రాష్ట్రంలో మూత పడిన చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమలకు ఆర్ధికంగా చేయూత ఇస్తారు. ఇతర ఆర్ధిక ఏజన్సీలతో కలిసి ఖాయిలా పడేందుకు దారితీసిన కారణాలను అధ్యయనం చేస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తారు. నిరర్ధక ఆస్తులు లేకుండా బ్యాంకులు ఆర్ధిక సహాయం ఇచ్చేందుకు ప్రణాళికను కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ సంస్ధ ఖరారు చేస్తుంది.
తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ సంస్ధ సలహాదారుగా డాక్టర్ ఎర్రంరాజును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎం సంజయను న ఇయమించారు. డైరెక్టర్లుగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కమిషనర్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్ధ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, హెల్త్ క్లినిక్ సలహాదారు డాక్టర్ బి ఎర్రంరాజును నియమించారు.
ఖాయిలా పడిన పరిశ్రమలకు ఆర్ధిక, మార్కెటింగ్ బ్రాండింగ్, కో బ్రాండింగ్ టెక్నాలజీ సేవలు అందిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లు, ఎంఎస్‌ఇ సెక్టార్, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తారు. వర్కింగ్ క్యాపిటల్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. సాంకేతిక, ఆర్ధిక అధ్యయనం చేసి చిన్న పరిశ్రమలు భవిష్యత్తులో మూతపడే ప్రమాదం నుంచి తప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని జీవోలో పేర్కొన్నారు.