బిజినెస్

ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల కోసం కొత్తగా రెండు పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: కొత్తగా రెండు ప్లాస్టిక్ తయారీ పార్కులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్ ప్రాంతంలో 170 ఎకరాలలో ప్రత్యేక ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. దీనిలో ప్రధానంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్థానం కల్పించనున్నామని, ఇందులో సుమారు 150 ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘తాప్మా పాలిమర్ కాన్ఫరెన్స్-2017’ రెండు తెలుగు రాష్ట్రాల సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ దీనికి సమీపంలోని మరో 350 ఎకరాల్లో మెగా ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేసి చిన్న, మధ్య, భారీతరహా పరిశ్రమలకు అవకాశం కల్పించనున్నామన్నారు. 200 నుంచి 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కొన్ని అంతర్జాతీయ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో 3 వేల ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వీటిలో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. ప్లాస్టిక్, ఆప్టికల్ పైబర్ కేబుల్ వాడకం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభమవుతున్న పరిశ్రమలతోపాటు, ఇక్కడ ఉన్న పాత కంపెనీలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవాడలలో కన్నా రాబోయే పారిశ్రామిక మండలాల్లో అత్యాధునిక వౌలిక వసతులను కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని జయేష్ రంజన్ వివరించారు. తాప్మా అధ్యక్షుడు వేణుగోపాల్ జాస్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖ్య కార్య నిర్వహణాధికారి పుణీత్ మదన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తాప్మా సదస్సులో మాట్లాడుతున్న జయేష్ రంజన్