బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అగ్రో-కెమికల్ దిగ్గజం యుపిఎల్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 741.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 191.94 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి మూడింతలకుపైగా పెరిగినట్లైంది. ఆదాయం ఈసారి 5,537.06 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,568.07 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
అంబుజా సిమెంట్
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అంబుజా సిమెంట్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 396.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 287.57 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 38.03 శాతం పెరిగినట్లైంది. ఆదాయం ఈసారి 6,449.02 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,998.86 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఫెడరల్ బ్యాంక్
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 256.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో కేవలం 10.26 కోట్ల రూపాయలుగానే ఉంది. ఆదాయం ఈసారి 2,598.06 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,262.94 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఐడిఎఫ్‌సి లిమిటెడ్
ఐడిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో స్వల్పంగా పెరిగి 134.80 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 130.45 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,577.88 కోట్ల రూపాయలుగా, పోయనసారి 2,101.61 కోట్ల రూపాయలుగా ఉంది.
సియట్ లిమిటెడ్
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 32.5 శాతం క్షీణించి 66.33 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 98.28 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,641.29 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,563.21 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.