బిజినెస్

కోకొకోలా ఇండియా అధిపతిగా కృష్ణకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: శీతల పానియాల తయారీ, విక్రయ దిగ్గజం కోకొకోలా ఇండియా ఉన్నతస్థాయి ఉద్యోగుల హోదాల్లో మార్పులు జరిగాయ. కోకొకోలా ఇండియా అధిపతి, నైరుతి ఆసియా బిజినెస్ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న వెంకటేశ్ కిని తప్పుకోవడంతో ఆ స్థానంలోకి టి కృష్ణకుమార్ వస్తున్నారు. అలాగే హిందుస్థాన్ కోకొకోలా బేవరేజెస్ నైరుతి ఆసియా రీజినల్ డైరెక్టర్‌గా కృష్ణకుమార్ స్థానంలో వియత్నాం, మయన్మార్, కంబోడియా బాట్లింగ్ ఇనె్వస్ట్‌మెంట్స్ గ్రూప్ రీజియన్ డైరెక్టర్ వంశీ మోహన్ నియమితులయ్యారు. ఇక సంస్థ కొత్త సిఇఒగా క్రిస్టినా రుగ్గిరో ఎంపికయ్యారు. ఈ మార్పులన్నీ కూడా వచ్చే నెల మే 1 నుంచి వర్తిస్తాయని సంస్థ తెలియజేసింది.