బిజినెస్

జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్ట్రాటెక్ సిమెంట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 10 శాతం పెరిగి 722.56 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 657.20 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఏకీకృత నికర అమ్మకాలు 5 శాతం పెరిగి ఈసారి 6,850.46 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 6,516.52 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ అమ్మకాలు 25,281 కోట్ల రూపాయలుగా, అంతకుముందు 24,056 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. లాభం కూడా 2,098 కోట్ల రూపాయల నుంచి 2,287 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏకీకృత నికర లాభం ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 22.5 శాతం పెరిగి 675.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు జనవరి-మార్చిలో 551 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 2,647.1 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,117.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ లాభం 2,344.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,901.1 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా గతంతో పోల్చితే 7,252.3 కోట్ల రూపాయల నుంచి 9,225.5 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఎమ్‌అండ్‌ఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చిలో 12 శాతం పెరిగి 411.33 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఇదే సమయంలో 367.26 కోట్ల రూపాయల లాభా న్ని పొందింది. ఆదాయం ఈసారి 1,904.88 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 1,680.10 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 15.4 శాతం దిగజారి 772.29 కోట్ల రూపాయలుగా, ఆదాయం 6,597.5 కోట్ల రూపాయలుగా ఉంది. 2015-16కుగాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 4 రూపాయల చొప్పున డివిడెండ్‌ను సంస్థ సిఫార్సు చేసింది.
వెల్‌స్పన్ ఇండియా
టెక్స్‌టైల్స్ సంస్థ వెల్‌స్పన్ ఇండియా ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చిలో 19.77 శాతం ఎగిసి 193.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇది 161.38 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 1,459.47 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,224.96 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ లాభం 702.87 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఇది 539.79 కోట్ల రూపాయలు. నికర అమ్మకాలు కూడా 4,722.9 కోట్ల రూపాయల నుంచి 5,387.66 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఒక్కో షేర్‌కు 0.05 రూపాయల చొప్పున తుది డివిడెండ్‌ను సంస్థ సిఫార్సు చేసింది.
సస్కెన్ కమ్యూనికేషన్
సస్కెన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం గత నెల మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 174.63 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో సంస్థ లాభం కేవలం 2.92 కోట్ల రూపాయలుగానే ఉండటం గమనార్హం. ఇక ఆదాయం ఈసారి 298.12 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 119.82 కోట్ల రూపాయలుగా ఉంది.
పర్సిస్టెంట్ సిస్టమ్స్
ఐటిరంగ సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 6.24 శాతం పెరిగి ఈ జనవరి-మార్చిలో 80.80 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 76.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 701.74 కోట్ల రూపాయలుగా, పోయినసారి 515.7 కోట్ల రూపాయలుగా ఉంది.
ఎబిబి ఇండియా
ఇంజినీరింగ్ సంస్థ ఎబిబి ఇండియా నికర లాభం ఈ జనవరి-మార్చిలో 30 శాతం ఎగిసి 70.98 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఇది 54.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,015.08 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,815.29 కోట్ల రూపాయలుగా ఉంది.
జెన్సర్ టెక్నాలజీస్
మధ్య శ్రేణి సాఫ్ట్‌వేర్ సర్వీసుల సంస్థ జెన్సర్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 70.67 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 71.80 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత నికర ఆదాయం ఈసారి 751.39 కోట్ల రూపాయలుగా, పోయినసారి 668.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ లాభం 311.90 కోట్ల రూపాయలుగా, ఆదాయం 2,978.04 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఏకీకృత నికర లాభం 37 శాతం క్షీణించి ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 58.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 93.13 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం ఈసారి 668.99 కోట్ల రూపాయలుగా, పోయినసారి 614.16 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 305.04 కోట్ల రూపాయలుగా, అంతకుముందు 248.08 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం కూడా 2,736.60 కోట్ల రూపాయల నుంచి 2,785.84 కోట్ల రూపాయలకు ఎగిసింది.