బిజినెస్

షేర్ చిన్నది.. లాభం పెద్దది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా షేర్ చిన్నది.. లాభం పెద్దది అనాల్సి వస్తోంది. అవును.. స్టాక్ మార్కెట్లలో బడా సంస్థల షేర్ల కంటే చిన్న, మధ్యశ్రేణి షేర్లే.. మదుపరులకు పెద్దగా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. బ్లూచిప్ సూచీ షేర్లలో పెట్టుబడులతో పోల్చితే స్మాల్, మిడ్-క్యాప్ సూచీల షేర్లలో పెట్టుబడులతో ఆకర్షణీయమైన లాభా లు అందుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) సూచీ సెనె్సక్స్ కంటే స్మాల్, మిడ్-క్యాప్ సూచీలు బాగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే మిడ్-క్యాప్ సూచీ 2,767.11 పాయింట్లు లేదా 23 శాతం పుంజుకుంది. ఇదే సమయంలో స్మాల్ -క్యాప్ సూచీ 3,326.38 పాయింట్లు లేదా 27.61 శాతం ఎగబాకింది. మరోవైపు బ్లూచిప్ సూచీ సెనె్సక్స్ 3,291.94 పాయింట్లు లేదా 12.36 శాతమే పెరిగింది. ఇక మునుపెన్నడూ లేనివిధం గా గురువారం 30,184.22 పాయింట్ల గరిష్ఠ స్థాయిని సెనె్సక్స్ తాకితే, బుధవారం మిడ్-క్యాప్ సూచీ 14,849.66 పాయింట్లు, స్మాల్-క్యాప్ సూచీ 15,486.40 పాయింట్ల ఆల్‌టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి. ఇకపోతే జనవరి నుంచి ఏప్రిల్ వరకు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలో కలిపి మొత్తం 91,385 కోట్ల రూపాయల (14 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో 4 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబ డులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపరు లు.. ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లలోకి 9,902 కోట్ల రూపాయల పెట్టుబడుల ను, రుణ మార్కెట్లలోకి మరో 5,960 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి ఫిబ్రవరిలో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 15,862 కోట్ల రూపాయలకు చేరింది. అయతే మార్చిలో ఈ విలువ మూడు రెట్లకు పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలోకి 31,327 కోట్ల రూపాయల పెట్టుబడు లను తీసుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లలోకి మరో 25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఫలితంగా మొత్తం మార్చి నెలలో దేశీయ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 56,944 కోట్ల రూపాయలకు చేరింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలోకి 2,394 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకు రాగా, రుణ మార్కెట్లలోకి 20,364 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం 22,758 కోట్ల రూపాయల (3.5 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు వచ్చిన ట్లైంది. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడులు తక్కువే అయినప్పటికీ, దేశీయ మదుపరులతోపాటు విదేశీ మదుపరులూ చిన్న, మధ్యశ్రేణి షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ‘స్మాల్, మిడ్-క్యాప్ సూచీల పెరుగుదల.. చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మదుపరులు పెట్టే చిన్నచిన్న పెట్టుబడులకు పెద్ద ప్రతిఫలమే లభిస్తోంది.’ అని అశికా స్టాక్ బ్రోకింగ్ ఈక్విటీ రిసెర్చ్ అధ్యక్షుడు పరస్ బోత్రా అన్నారు. సాధారణంగా స్మాల్, మిడ్-క్యాప్ సూచీ షేర్లను దేశీయ మదుపరులు కొంటారు. బ్లూచిప్ షేర్లను విదేశీ మదుపరులే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇటీవలికాలంలో విదేశీ మదుపరులూ తమ పెట్టుబడుల్లో కొంత స్మాల్, మిడ్-క్యాప్ షేర్ల కోసం కేటాయిస్తుండటం విశేషం.