బిజినెస్

ఏప్రిల్ నెల ఆటో అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. గత నెల మొత్తం అమ్మకాలు 6 శాతం క్షీణించి 39,357 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఏప్రిల్‌లో 41,863 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశీయంగా ఈసారి 37,829 యూనిట్ల అమ్మకాలు జరగగా, ఎగుమతులు 1,528 యూనిట్లుగా ఉన్నాయని సంస్థ తెలిపింది.
మహీంద్ర ట్రాక్టర్
మహీంద్ర అండ్ మహీంద్ర ట్రాక్టర్ల తయారీ విభాగం మహీంద్ర ట్రాక్టర్ల అమ్మకాలు ఏప్రిల్‌లో 22 శాతం పెరిగి 26,001 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఏప్రిల్‌లో 21,386 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు ఈసారి 920, పోయినసారి 682 యూనిట్లుగా ఉన్నాయి.
ఫోర్డ్ ఇండియా
ఫోర్డ్ ఇండియా మొత్తం విక్రయాలు ఈ ఏప్రిల్‌లో 52.69 శాతం ఎగిసి 25,149 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు ఇదే నెల 16,470 యూనిట్లకే పరిమితమయ్యాయి. దేశీయంగా ఈసారి 7,618 యూనిట్లు, ఎగుమతులు 17,531 యూనిట్లుగా ఉన్నాయని ఫోర్డ్ తెలిపింది.
అశోక్ లేలాండ్
హిందుజా గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ అశోక్ లేలాండ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 7,083 వాహనాలను అమ్మింది. నిరుడు ఇదే నెల అమ్మకాలు 10,182 యూనిట్లుగా ఉన్నాయి. ఈసారి భారీ, మధ్యశ్రేణి వాహన విక్రయాలు 4,525 యూనిట్లుగా, తేలికపాటి వాణిజ్య వాహన అమ్మకాలు 2,558 యూనిట్లుగా ఉన్నాయని అశోక్ లేలాండ్ స్పష్టం చేసింది.
హోండా మోటార్‌సైకిల్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మొత్తం అమ్మకాలు గత నెల ఏప్రిల్‌లో 5,78,929 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఏప్రిల్‌లో 4,31,065 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయంగా ఈసారి 5,51,884 యూనిట్ల అమ్మకాలు జరిగితే, ఎగుమతులు 27,045 యూనిట్లుగా ఉన్నాయి.
టివిఎస్ మోటార్
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ మోటార్ మొత్తం అమ్మకాలు ఈ ఏప్రిల్‌లో 2,46,310 యూనిట్లుగా, నిరుడు ఏప్రిల్‌లో 2,27,096 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు ఈసారి 40,221 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు 28,354 యూనిట్లుగా ఉన్నాయి.
సుజుకి మోటార్‌సైకిల్
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ అమ్మకాలు ఈ ఏప్రిల్‌లో 36,289 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు 25,343 యూనిట్లుగా ఉండగా, ఎగుమతులు ఈసారి 7,535 యూనిట్లుగా, పోయినసారి 5,290 యూనిట్లుగా ఉన్నాయని సుజుకి మోటార్‌సైకిల్ వెల్లడించింది.