బిజినెస్

కొత్త లోగోను తెచ్చిన విప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారతీయ ఐటి రంగ దిగ్గజాల్లో ఒకటైన, దేశీయ మూడో అతిపెద్ద ఐటి రంగ సంస్థ అయిన విప్రో.. తమ లోగోను మార్చింది. ఓ సరికొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న బహుళ వర్ణ ప్రొద్దుతిరుగుడు పువ్వు లోగోను 1998లో పరిచయం చేసిన విప్రో.. తాజాగా ఓ కొత్త రూపంలో మరో లోగోను తీసుకొచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ.. 1945లో మహారాష్టల్రోని అమల్నర్‌లో వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌గా మొదలైంది. 1981లో ఐటి రంగంలోకి అడుగిడింది. 1985లో స్వదేశీ మార్కెటింగ్‌లో దిక్సూచిగా అవతరించిన విప్రో.. 2000లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ప్రవేశించింది. 1.7 లక్షలకుపైగా ఉద్యోగులు కలిగిన విప్రో.. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 8.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.

చిత్రాలు..విప్రో కొత్త లోగో
* విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జి