బిజినెస్

చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 28: ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ బీడీ కార్ఖానాలు శుక్రవారం నుండి మళ్లీ తెరుచుకోనున్నాయి. బీడీ కంపెనీల యాజమాన్య సంఘంతో కార్మిక శాఖ అధికారుల సమక్షంలో బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది బీడీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీడీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లాలో గురువారం బీడీ యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరేంద్రగాంధీతో బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు డిప్యూటీ లేబర్ కమిషనర్ చతుర్వేది సమక్షంలో ఆయన చాంబర్‌లో చర్చలు జరిపారు. బీడీ కట్టలపై 85శాతం మేర పుర్రె, క్యాన్సర్ గుర్తులను ముద్రించాలని కేంద్రం విధించిన ఆంక్షల నేపథ్యంలో బీడీ యాజమాన్యాలు గత మార్చి మాసంలో 15 నుండి 25వ తేదీ వరకు పది రోజుల పాటు సమ్మె జరిపారు. ఈ సమ్మెకు కార్మికులు, కార్మిక సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా కొనసాగడంతో, ఈ సమావేశాల్లో పుర్రె గుర్తు ఆంక్షలను లేవనెత్తి కేంద్రం ద్వారా కొంతవరకైనా వెసులుబాటు కల్పిస్తారని ఆశించారు. అయితే అలాంటిదేమీ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం, ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆంక్షలు అమల్లోకి రావడంతో బీడీ యాజమాన్యాలు తిరిగి ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీలన్నీ మూసి వేశాయి. ఫలితంగా సుమారు 7లక్షల మంది బీడీలు చుట్టే కార్మికులు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందస్తుగా ఎలాంటి నోటీసులు అందించకుండా, కార్మిక సంఘాలతో చర్చించకుండానే యాజమాన్యాలు ఉన్నపళంగా కంపెనీలను మూసివేయడంతో బీడీ కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. ఈ విషయమై కార్మిక శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేస్తూ వారిపై ఒత్తిడి పెంచారు. కంపెనీల మూసివేత వల్ల లక్షలాది మంది ఉపాధిని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. అసలే కరవు తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బడుగు జీవులకు ఏకైక ఆధారంగా ఉన్న బీడీ పరిశ్రమ కూడా మూతబడడంతో వాస్తవంగానే లక్షలాది కుటుంబాలు రోజువారీ జీవనాలు సాగించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్మికులు ఆందోళనలను ఉద్ధృతం చేయడంతో దిగివచ్చిన బీడీ కంపెనీల యాజమాన్యాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. ఈ క్రమంలోనే ఈ నెల 29వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీడీ కంపెనీలను తిరిగి యథాతథంగా కొనసాగించేందుకు యాజమాన్య సంఘాల ప్రతినిధి ధర్మేంద్ర గాంధీ అంగీకరిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సిద్ధిరాములు తెలిపారు.