బిజినెస్

వచ్చే నెలలో ముచ్చెర్ల ఫార్మాసిటీపై ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ శివారులోని ముచ్చెర్ల వద్ద ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం వచ్చే నెలలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయల సంస్థ (టిఎస్‌ఐఐసి) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఆ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతి పొందేందుకు ప్రయత్నించనుంది. సింగపూర్‌కి చెందిన సుర్భానా జురాంగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ ఫార్మాసిటీని 12,500 ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి దశలో 6 వేల ఎకరాల్లో చేపట్టబోయే ఫార్మాసిటీకి ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నివేదిక తీసుకోవాల్సి ఉంది. కాగా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, డాక్టర్ రెడ్డీస్, మిలాన్, అరబిందో వంటి దాదాపు 150 పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ముచ్చెర్ల ఫార్మాసిటీలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఒక్కో కంపెనీ.. 10 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు అవసరాన్ని బట్టి భూ కేటాయింపులు కోరుతున్నాయి.