బిజినెస్

దద్దరిల్లిన దలాల్ స్ట్రీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకేసింది. బుధవారం ట్రేడింగ్‌లో అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో గత రికార్డులన్నీ కొట్టుకుపోగా, కొత్త రికార్డులు కొలువుదీరాయి. వర్షపాత అంచనాలను వాతావరణ శాఖ పెంచడమే మార్కెట్ జోష్‌కు అసలు కారణం. ఇంతకుముందు ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాలు అంతంతమాత్రంగానే పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మంగళవారం ఈసారి వర్షాలు సాధారణంగా ఉంటాయని ప్రకటించింది. దీంతో మదుపరులు ఉదయం ప్రారంభం నుంచే పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. సమయం గడుస్తున్నకొద్దీ ఈ పెట్టుబడులు పెరిగిపోయాయి. ఎరువులు, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఒకానొక దశలో బిఎస్‌ఇ ప్రధాన సూచీ అయిన సెనె్సక్స్ 30,271.60 పాయింట్లను తాకింది. ఫలితంగా సరికొత్త ఇంట్రా-డే రికార్డును నెలకొల్పింది. గత నెల ఏప్రిల్ 26న జరిగిన ట్రేడింగ్‌లో తొలిసారిగా ఒకసారి 30,184.22 పాయింట్లను అందుకుంది. ఇక మంగళవారం ముగింపుతో చూస్తే చివరకు 314.92 పాయింట్ల లాభంతో మునుపెన్నడూ లేనివిధంగా 30,248.17 వద్ద స్థిరపడింది. గత నెల ఏప్రిల్ 26న 30,133.35 పాయింట్ల వద్ద ముగియగా, ఇప్పుడు ఆ రికార్డు కనుమరుగైపోయింది. ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ సైతం 9,400 మార్కును మొదటిసారిగా అధిగమించింది. ట్రేడింగ్ మధ్యలో 9,414.75 పాయింట్లను తాకి ఆల్‌టైమ్ ఇంట్రా-డే రికార్డును సృష్టించగా, అంతకుముందు ఈ నెల 5న నమోదైన 9,377.10 పాయింట్ల రికార్డు చెరిగిపోయింది. ఇక మార్కెట్ ముగింపు సమయానికి 90.45 పాయింట్ల పెరుగుదలతో 9,407.30 వద్ద నిలిచింది. దీంతో అప్పటిదాకా ఉన్న 9,359.90 పాయింట్ల రికార్డు పాతబడిపోయింది. ఈ నెల 4న ఈ రికార్డును నమోదు చేసింది నిఫ్టీ. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే వ్యవసాయ ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్న విశ్వాసం మదుపరులలో సర్వత్రా కనిపించింది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఎమ్‌సిజి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఆకట్టుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు. వర్షపాతం బాగుంటే గ్రామాల్లో కొనుగోళ్ల సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పారు. ఇక రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ షేర్లతోపాటు ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్‌కోర్, మద్రాస్ ఫర్టిలైజర్ అండ్ చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ షేర్లు 6.89 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. అలాగే టెలికామ్ షేర్లు 4.59 శాతం పెరిగాయి. ఆటో, ఎనర్జీ రంగాల షేర్లూ లాభపడగా, ఐటి, రియల్టీ రంగాల షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. కీలక సూచీల్లో హాంకాంగ్, జపాన్ సూచీలు మాత్రమే లాభాలను అందుకున్నాయి. అటు ఐరోపా మార్కెట్లలోనూ ఇదే తీరు కనిపించింది. ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టపోగా, బ్రిటన్ సూచీ మాత్రం లాభపడింది.
2 ట్రిలియన్ డాలర్ల మార్కుకు
చేరువలో మదుపరుల సంపద
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన నేపథ్యంలో మదుపరుల సంపద కూడా రికార్డు స్థాయికి చేరింది. బిఎస్‌ఇ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. బుధవారం ట్రేడింగ్ ముగిశాక బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల విలువ 1,26,61,536 కోట్ల రూపాయలకు చేరింది. డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ ప్రకారం ఇది 1.95 ట్రిలియన్ డాలర్లకు సమానం. కాగా, సెనె్సక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువలో దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువ అత్యధికంగా 4,59,602.32 కోట్ల రూపాయలుగా ఉంది. తర్వాతి స్థానంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువ ఉంది. ఇది 4,42,018.71 కోట్ల రూపాయలుగా ఉంది. సుధీర్ఘకాలం అనంతరం టిసిఎస్‌ను ఆర్‌ఐఎల్ ఇటీవల అధిగమించినది తెలిసిందే. అయతే మళ్లీ టిసిఎస్సే అగ్రస్థానం లోకి వచ్చింది. కాగా, బిఎస్‌ఇలో మొత్తం 5 వేలకుపైగా సంస్థలున్నాయి.