బిజినెస్

తెలంగాణ బ్రాండ్ మిర్చి, పసుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: త్వరలోనే తెలంగాణ బ్రాండ్‌తో పసుపు, మిర్చి పొడులను విక్రయించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మిర్చిని సేకరిస్తారు. అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి సేకరిస్తూనే గిరిజన సహకార సంస్థ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే విధంగా వ్యాపారం సాగించనున్నట్టు అటవీ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజన ప్రాంతాల్లో 25 పెట్రోల్, డిజిల్ బంకులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ గిరిజన బ్రాండ్ పేరు మీద నెల రోజుల్లో తేనె ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతున్నట్టు మంత్రి తెలిపారు. ఇదే బ్రాండ్ పేరుతో మరో రెండు నెలల్లో సబ్బులను, షాంపులను మార్కెట్‌లో ప్రవేశపెడతారు. అటీవ సంపదపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు ప్రభుత్వ సహకార సంస్థ ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించే విషయం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారి ఉత్పత్తులను సేకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో ఉన్న మిరప పంటను సేకరించాలని అధికారులకు చెప్పారు. గిరిజన సహకార సంస్థ ఉత్పత్తి చేస్తున్న వస్తువులను గిరిజన విద్యాలయాలకే కాకుండా అన్ని విద్యా సంస్థలకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి చందూలాల్ కోరారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చింతపండు సేకరించాలని ఆదేశించారు. గిరిజన సహకార సంస్థ వ్యాపార కార్యకలాపాలపై మంత్రి చందూలాల్ గురువారం సమీక్షించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమీషనర్ లక్ష్మణ్, గిరిజన సహకార సంస్థ రీజినల్ మేనేజర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.