బిజినెస్

దిగివచ్చిన ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఆహార వస్తువులతో పాటుగా ఉత్పాదక ఐటంల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయి అయిన 3.85 శాతానికి తగ్గింది. అలాగే వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సైతం 2.99 శాతానికి పడిపోయింది. మార్చి నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.29 శాతంగా ఉండగా, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.89 శాతంగా ఉంది. కాగా, మార్చి నెలలో పారివ్రామిక ఉత్పత్తి 2.7 శాతానికి పడిపోయింది. ఉత్పాదక రంగం పని తీరు ఆవించిన స్థాయిలో లేక పోవడమే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం.
ప్రభుత్వం టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలకు సంబంధించి కొత్త విధానాన్ని శుక్రవారం ప్రకటించింది. ఇంతకు ముందు ఈ విధానాలకు బేస్ ఇయర్ 2004-05 ఆర్థిక సంవత్సరం ఉండగా, ఇప్పుడు దాన్ని 2011-12 ఆర్థిక సంవత్సరానికి సవరించింది. కొత్త సిరీస్ సూచీలో మొత్తం 697 ఐటంలుండగా 117 ప్రాథమిక వస్తువులు, ఇంధన, విద్యుత్ రంగాలకు చెందిన 16, 564 ఉత్పాదక వస్తువులు ఉన్నాయి. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.82 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో అది 1.16 శాతానికి తగ్గింది. ప్రధానంగా పప్పు్ధన్యాలు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయల ధరలు తగ్గడమే ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం.
కాగా, ఉత్పాదక రంగం ఉత్పత్తి వృద్ధి గత ఏడాది మార్చి నెలలో 5 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నెలలో 1.2 శాతానికి తగ్గిపోయింది. అలాగే విద్యుత్ రంగం ఉత్పత్తి సైతం గత ఏడాది మార్చి నెలలో 11.9 వాతం వృద్ది చెందగా, ఈసారి అది 6.2 శాతానికి పడిపోయింది. అయితే మైనింగ్ రంగంలో మాత్రంలో వృద్ధి గత ఏడాది మార్చిలో ఉండిన 4.7 శాతంనుంచి 9.7 శాతానికి పెరిగింది.