బిజినెస్

ఏకపక్షంగా పన్నులు విధిస్తే వాణిజ్య యుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 12: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) నియమ నిబంధనలను పట్టించుకోకుండా తమ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఏకపక్షంగా సుంకాలను విధిస్తే అమెరికాతో వాణిజ్య యుద్ధం తప్పదని చైనా హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వమున్న ఏ దేశమైనా తమ సొంత ప్రయోజనాల కోసం డబ్ల్యుటిఓ నిబంధనలను బేఖాతరు చేసినా, లేక వాణిజ్య వివాదాలపై డబ్ల్యుటిఓ ఇచ్చిన తీర్పులను తిరస్కరించినా అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలు అర్థరహితమవుతాయని, ఇదే గనుక జరిగితే 1930వ దశకంలో తలెత్తిన వాణిజ్య యుద్ధాలు మళ్లీ పునరావృతం కావడం తథ్యమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సన్ జివెయ్ స్పష్టం చేశారు. డబ్ల్యుటిఓ నిర్ణయాలకు తమ దేశం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం తమ వార్షిక వాణిజ్య విధాన అజెండాను అమెరికా పార్లమెంట్‌కు పంపడంపై సన్ జివెయ్ ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతులు గణనీయంగా పెరిగి దేశీయ పరిశ్రమకు తీవ్రమైన హాని జరిగినట్లయితే విదేశీ వస్తువులపై ఏకపక్షంగా సుంకాలను విధించేందుకు వీలు కల్పించే రక్షణాత్మక నిబంధనలతో కూడిన సొంత వాణిజ్య చట్టాలను అమెరికా కట్టుదిట్టగా అమలు చేయాలన్న ధ్యేయంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చైనాకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రకటనలు చేసిన ట్రంప్.. ఎగుమతుల ద్వారా ఆయాచిత లబ్ధిని పొందేందుకు కరెన్సీ విలువను తరచుగా మార్చి మోసగించే దేశంగా చైనాపై ముద్ర వేయడంతో పాటు చైనా నుంచి వచ్చే వస్తువులపై 45 శాతం సుంకాలను విధిస్తానని బెదిరించిన విషయం విదితమే. అయితే చైనా, అమెరికా పరస్పరం ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని, చైనా వస్తువులపై అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధిస్తే కేవలం ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు విఘాతం కలగడమే కాకుండా ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి జోంగ్ షాన్ గత వారం మీడియాతో అన్నారు. ‘అమెరికాపై చైనా ఆధారపడి ఉందని చాలా మంది అమెరికన్లతో పాటు వారి పాశ్చాత్య మిత్ర దేశాలు భావిస్తున్నాయి. ఈ అభిప్రాయంలో పాక్షికంగా నిజం ఉందని నేనూ అభిప్రాయపడుతున్నా. కానీ అమెరికా కూడా చైనాపై ఆధారపడక తప్పదు’ అని జోంగ్ స్పష్టం చేశారు.