బిజినెస్

ఐడియాకి ‘జియో’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 13: ఏడాది క్రితం మార్కెట్లోకి ప్రవేశించినప్పటినుంచి ఉచిత ఆఫర్లతో సంచనాలు సృష్టిస్తున్న రియలన్స్ జియో దెబ్బకు టెలికాం సంస్థలు వరసగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఐడియా సెల్యులార్ లిమిటెడ్ వరసగా రెండో త్రైమాసికంలో నష్టాలను మూటగట్టుకుంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఐడియా రూ.326 కోట్ల నష్టాలను చవి చూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 452 కోట్లు ఉండింది. 2016 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ తొలిసారిగా ఏకీకృత ప్రాతిపదికన రూ.383.87 కోట్ల నష్టం చవి చూసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో కంపెనీ 659.35 కోట్ల రూపాయల లాభాల్లో ఉండడం గమనార్హం.‘కొత్తవారి ప్రవేశంతో 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టెలికాం పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. గత ఏడాది అక్టోబర్‌నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ రంగానికి విరామకాలంగా భావించవచ్చు. ఏది ఏమయినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం తిరిగి లాభాల బాటలోకి రావచ్చని భావిస్తున్నాం’ అని ఐడియా ఒక ప్రకటనలో తెలిపింది.