బిజినెస్

‘విస్తారా’కి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, మే 13: భారత్‌లో పౌర విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) దేశీయ విమానయాన సంస్థ ‘విస్తారా’లో 10 కోట్ల సింగపూర్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ‘విస్తారా’లో పెట్టుబడుల కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ తొలుత నిర్ధేశించుకున్న దాని కంటే ఇది రెట్టింపు మొత్తమని సింగపూర్‌కు చెందిన ‘స్ట్రైట్స్ టైమ్స్’ దినపత్రిక వెల్లడించింది. భారత్‌లో ‘విస్తారా’ పనితీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని, అందుకే ఈ సంస్థలో తొలుత నిర్ధేశించుకున్న దానికంటే తమ సంస్థ ఎక్కువ పెట్టుబడులు పెట్టినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారని, అయితే వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉన్నందున ‘విస్తారా’లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడులను ధ్రువీకరించేందుకు ఆయన నిరాకరించారని ఆ పత్రిక పేర్కొంది.