బిజినెస్

భారీ నష్టాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 461 పాయింట్లకు పైగా నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. గత మూడు వారాల్లో సెనె్సక్స్‌ఒక్క రోజులో ఇంత నారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. తాజాగా మరోసారి ఉద్దీపనాలను ప్రకటించరాదని బ్యాంక్ ఆఫ్ జపాన్ (బిఓజి) తీసుకున్న నిర్ణయం మదుపరులను ఆశ్చర్యానికి గురి చేయడం మార్కెట్ల భారీ పతనానికి ప్రధాన కారణం. అలాగే ఏప్రిల్ నెల ఫ్యూచర్స్, అప్షన్ల ముగింపు నేపథ్యం కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించడం, ఆసియా మార్కెట్లలో మాంద్యం కారణంగా అంతర్జాతీయ సూచీలు బలహీనంగా మారడం లాంటి వాటి కారణంగా మదుపరులు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డం కూడా సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 7,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రధానంగా లోహాలు, చమురు,గ్యాస్, ఎఫ్‌ఎంసిజి, వౌలిక సదుపాయాలు, ఆటో రంగాల షేర్ల పతనం కారణంగా సూచీలు భారీగా పతనమైనాయి. నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాల మాట పట్టాయి. దీంతో అది 461 పాయింట్లు పతనమై 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 5 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. జపాన్ ప్రధాన సూచీ నిక్కీ 3.65 శాతం పతనం కాగా, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.27 శాతం పతనమైంది. ఐరోపా షేర్లు సైతం భారీగా పతనమైనాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి,ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, గెయిల్, టాటా స్టీల్, ఎన్‌టిపిసిలాంటి మార్కెట్ హెవీవెయిట్‌లు 3.21 శాతంనుంచి 2.45 శాతం దాకా పడిపోయాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ సైతం 132.65 పాయింట్లు పడిపోయి 7,847.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, కొరియా ఎక్స్‌చేంజిలో సెనె్సక్స్ ఆధారిత డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు లిస్టింగ్ చేయడానికి ఆ ఎక్స్‌చేంజితో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బిఎస్‌ఇ గురువారం ప్రకటించింది. భారత్, దక్షిణ కొరియాలలో డెరివేటివ్స్ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని బిఎస్‌ఇ ఆ ప్రకటనలో తెలిపింది.