బిజినెస్

స్నాప్‌డీల్ సిబ్బందికి రూ.193కోట్ల లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఓ కంపెనీని అమ్మేయటం అంటే అది అందులో పని చేస్తున్న ఉద్యోగుల పాలిట శాపమే అవుతుంది. కారణం తమ భవితవ్యం విషయంలో ఆ ఉద్యోగులు ఆందోళన చెందటమే కానీ, స్నాప్ డీల్ విషయంలో సిబ్బందికి పండగే పండగ. ఈ సంస్థ తన ఉద్యోగులకు దాదాపు రూ.193కోట్ల బొనాంజాను ఈ వ్యవహారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ చేపడితే ఆర్థికంగా ఆ సంస్థ ఉద్యోగులు గణనీయంగా లబ్ధి పొందే అవకాశం ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా. అనుకున్నట్లుగా స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ చేపట్టే పక్షంలో తమకొచ్చే మొత్తంలో దాదాపు రూ.190కోట్ల రూపాయల మేర సిబ్బందికే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్నాప్ డీల్‌లో 1500 నుంచి 2వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్నాప్‌డీల్ టీంకు చెల్లించటానికి వీలుగా దాదాపు 30మిలియన్ డాలర్ల వితరణకు సంబంధించి సెటిల్మెంట్ పథకాన్ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఈ సంస్థ తన బోర్డును కోరినట్లు స్పష్టం అవుతోంది. అంటే ఈ కొనుగోలు వ్యవహారంలో స్నాప్‌డీల్ సిబ్బందికి ఏ విధంగానూ నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత 12నెలల్లో స్నాప్‌డీల్‌ను వదిలేసి వెళ్లిన సిబ్బందికి కూడా దీని వల్ల ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.